పాక్ కాల్పులను తిప్పి కొట్టిన భారత్ | BSF assures strong retaliation to ceasefire violations by Pakistan | Sakshi
Sakshi News home page

పాక్ కాల్పులను తిప్పి కొట్టిన భారత్

Published Thu, Aug 28 2014 8:33 AM | Last Updated on Sat, Sep 2 2017 12:35 PM

BSF assures strong retaliation to ceasefire violations by Pakistan

జమ్మూకాశ్మీర్: పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పర్గ్వాల్ సెక్టార్లోని 3 బీఎస్ఎఫ్ బలగాల శిబిరాలపై పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. దాంతో భారత్ సైన్యం వెంటనే స్పందించి ... పాక్ బలగాలపైకి దీటుగా కాల్పులు జరిపింది. దాంతో భారత్, పాక్ దేశాల మధ్య హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి.

అయితే పాక్ కాల్పుల వల్ల భారత్ వైపు ఎటువంటి నష్టం జరగలేదని సమాచారం. భారత్ - పాక్ దేశాల మధ్య ప్లాగ్ మీటింగ్ జరిగిన కొద్ది గంటలకే ఈ కాల్పులు జరగడం గమనార్హం. గత రెండు వారాల్లో ఇప్పటి వరకు పాక్ 20 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement