Ceasefire violations
-
9 నెలల్లో ఏకంగా 3186 సార్లు ఉల్లంఘన
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్ ఆగడాలు సరిహద్దుల్లో రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికి పాక్ మాత్రం దాన్ని తుంగలో తొక్కుతూ తరచూ సరిహద్దులో కాల్పులకు తెగబడుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం సరిహద్దుల్లో పాకిస్తాన్ ఇదే తరహా వ్యవహరిస్తూ ఉంటుంది. అందుకే సరిహద్దులో అప్రమత్తంగా ఉండే భారత సైన్యం… పాకిస్తాన్ దాడులను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూ ఉంటుంది. అయితే 17 ఏళ్లలో మొదటిసారి సరిహద్దుల్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎక్కువసార్లు ఉల్లంఘించింది. ఈ జనవరి నుంచి సెప్టెంబర్ 7 వరకు దాదాపు తొమ్మిది నెలల్లో 3186 సార్లు పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా తెలిపింది. అయితే ప్రతిసారి భారత సైన్యం పాకిస్తాన్‌ను సమర్ధవంతంగా తిప్పికొట్టినట్లు కేంద్రం ప్రకటించింది. అంతేకాకుండా, పాకిస్తాన్‌తో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ ప్రాంతంలో 242 సరిహద్దు కాల్పులు (జనవరి 1 నుంచి ఆగస్టు 31 వరకు) జరిగాయని రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ రాజ్యసభలో తెలిపారు. (చదవండి: భారత్‌పై ఆన్లైన్ వార్‌కు పాక్ కుట్ర) ఈ ఏడాది కాల్పుల విరమణ ఉల్లంఘనల సందర్భంగా ఎనిమిది మంది ఆర్మీ సిబ్బంది దేశం కోసం మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. పెద్ద సంఖ్యలో అమాయక పౌరులు చంపబడ్డారు, అనేక ఇళ్ళు, భవనాలు ధ్వంసమయ్యాయని శ్రీపాద్ నాయక్ తెలిపారు. ఈ ఏడాది జూన్ వరకు 2,432 కాల్పుల విరమణ ఉల్లంఘనలు నమోదయ్యాయని ఇవి అప్రకటిత దాడులే కాక 2003 కాల్పుల విరమణ అవగాహనకు విరుద్ధంగా జరిగాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఉపసంహరణతో పాటు రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాలని గతేడాది ఆగస్టులో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇరు దేశాల మధ్య శత్రుత్వం కూడా పెరిగింది. 2019 అంతటా సుమారు 2,000 కాల్పుల విరమణ ఉల్లంఘనలు మాత్రమే జరిగాయి. -
భారత్ ప్రతీకార దాడి: పాక్ సైనికులు హతం
పూంచ్(జమ్మూ కశ్మీర్) : పాకిస్తాన్ ఆర్మీ రెచ్చగొడ్డుటు చర్యలకు భారత్ మరోసారి గట్టిగా సమాధానం చెప్పింది. ఈ శుక్రవారం పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి భారత్ జరిపిన ప్రతీకార కాల్పుల్లో నలుగురు పాక్ సైనికులు చనిపోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కాల్పుల్లో పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలు కూడా తీవ్రంగా ధ్వంసమయ్యాయి. కాగా, కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లుపొడుస్తూ పాక్ బలగాలు ఆరు రోజుల వ్యవధిలో మూడు సార్లు నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరిపాయి. నిన్న నియంత్రణ రేఖ వెంబడి పాక్ జరిపిన కాల్పులను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. దాయాది దేశం దాడిలో ఓ జమ్మూకశ్మీర్ పౌరుడు గాయాలపాలయ్యాడు. చదవండి : భారత్‌పై ఇమ్రాన్ ఖాన్ తీవ్ర ఆరోపణలు -
కాల్పుల విరమణకు పాకిస్తాన్ తూట్లు∙
జమ్మూ: పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది. కశ్మీర్‌లోని పూంచ్, రాజౌరీ జిల్లాల్లో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి ఉన్న గ్రామాల్లో పాక్ సైన్యం భారీగా కాల్పులకు తెగబడింది. దీంతో పూంచ్ జిల్లా పరిధిలోకి వచ్చే దాదాపు అరడజను ప్రభుత్వ పాఠశాలల్లో తరగతులను నిలిపివేయాల్సిందిగా ఆదేశించినట్లు శనివారం అధికారులు వెల్లడించారు. పూంచ్ జిల్లాలోని షాపూర్, కెర్నీ సెక్టార్లను లక్ష్యంగా చేసుకుని పాక్ తీవ్ర కాల్పులకు పాల్పడిందని రక్షణ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. ఈ ఘటనలో 16 జంతువులు మృతిచెందినట్లు పూంచ్ జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాహుల్ యాదవ్ తెలిపారు. -
103 మంది ఉగ్రవాదుల హతం
న్యూఢిల్లీ : ఈ ఏడాది జూన్ 6 వరకు భద్రతా దళాలు సుమారు 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమర్చాయని రక్షణ వర్గాలు వెల్లడించాయి. 2019లో ఇప్పటివరకు జమ్ముకశ్మీర్‌లో 103 మంది ఉగ్రవాదులను హతమార్చగా.. 2018లో ఈ సంఖ్య 254గా ఉందని ఓ న్యూస్ ఎజెన్సీ పేర్కొంది. అలాగే 2019లో పాకిస్థాన్ 1,170 సార్లు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడిందని.. 2018లో 1,629 సార్లు ఉల్లఘించిందని తెలిపింది. 2018లో డిసెంబరు 2 వరకు 238 ఉగ్రవాద కార్యకలాపాలను భద్రతా బలగాలు నిలువరించాయి. అలాగే రాళ్లతో దాడికి పాల్పడే ఘటనలను కూడా చాలా వరకు తగ్గించగలిగాయి. అయితే 2018లో 86 మంది భద్రతా సిబ్బంది, 37 మంది సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. 2017ను ఆపరేషన్ ఆలౌట్‌గా చెప్తారు. ఆ ఏడాది జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో 329 ఉగ్ర దాడులు జరగ్గా.. 200 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మొత్తం ఈ ఘటనల్లో 74 మంది భద్రతా సిబ్బంది, 36 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. -
సరిహద్దుల్లో ఆగని కాల్పుల మోత..!
-
సరిహద్దుల్లో ఆగని కాల్పుల మోత..!
శ్రీనగర్ : ఓ వైపు అభినందన్ వర్థమాన్ విడుదలతో భారత్ పాక్ మధ్య శాంతి చర్చల ప్రక్రియ మొదలవుందని అందరూ భావిస్తుండగా.. దాయాది దేశం మాత్రం పాత పాటే పాడుతోంది. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తోంది. పూంచ్, రాజౌరీ జిల్లాల్లో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి ఉన్న భారత సైనిక స్థావరాలు, జనావాసాలే లక్ష్యంగా భారీ తుపాకులు, 105 ఎంఎం హోవిట్జర్లతో విరుచుకుపడుతోంది. మోర్టార్ షెల్స్‌తో దాడికి తెగబడింది. పాక్ రేంజర్ల దాడులను భారత భద్రతా దళాలు దీటుగా తిప్పికొడుతున్నాయి. ఈ క్రమంలో ఐదుగురు భద్రతా సిబ్బంది, ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు, ఇద్దరు పోలీసులు ప్రాణాలు కొల్పోయారు. ఒక పౌరుడు, మరో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పూంచ్ జిల్లాలో పాక్ రేంజర్ల దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయమై ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పాక్ రేంజర్ల దాడిలో రుబానా కోసర్ (24), ఆమె కుమారుడు ఫజాన్ (5)తో పాటు తొమ్మిది నెలల కుమార్తె ఫబ్నమ్ చనిపోయినట్టు తెలిపారు. ఈ ఘటనలో రుబానా భర్త యూనిస్ గాయలతో బయటపడ్డాడని వెల్లడించారు. అంతకు ముందు పాక్ కాల్పుల్లో నసీమ్ అనే పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు. గత వారం రోజుల్లో పాక్ 60 సార్లు కాల్పువ ఉల్లంఘనకు పాల్పడిందన్నారు. ఈ నేపథ్యంలో రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో ఎల్వోసీకి 5 కిలోమీటరల పరిధిలో ఉన్న విద్యాసంస్థలన్నింటినీ మూసివేయాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. గతేడాది పాక్ 2,936 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. భయాందోళనలతో సరిహద్దు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు సమాచారం.ఉగ్రవాదుల స్థావరాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. -
పాక్ కాల్పుల్లో ఆర్మీ అధికారుల మృత్యువాత
శ్రీనగర్: కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. సరిహద్దుకు అవతలి వైపు నుంచి పాక్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత్ సైనికాధికారులు మృతి చెందారు. కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి(ఎల్వోసీ) శుక్రవారం పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో జూనియర్ కమిషన్డ్ అధికారులు(జేసీవోలు) ఇద్దరు నేలకొరిగారని సైన్యం తెలిపింది. పాక్ దుశ్చర్యను భారత్ బలగాలు సమర్ధంగా తిప్పికొట్టాయని పేర్కొంది. -
పాక్ దొంగదెబ్బ.. ఐదుగురి మృతి
శ్రీనగర్: పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. అంతర్జాతీయ సరిహద్దుల్లో ఆదివారం తెల్లవారుజామున పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూకశ్మీర్ పరగ్వాల్ సెక్టార్‌లోని అక్నూర్లో జమాన్ బెళా పోస్టుపై పాకిస్తాన్ రేంజర్లు దొంగ చాటుగా దాడి చేశారు. ఈ దాడిలో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ వీకే పాండే (27), ఏఎస్ఐ ఎస్ఎన్ యాదవ్ (48) సహా ముగ్గురు పౌరులు మృతి చెందారనీ పరగ్వాల్ చెక్ పోస్ట్ ఇన్చార్జ్ బ్రిజిలాల్ శర్మ తెలిపారు. ప్రతిగా భారత బలగాలు దాడులు ప్రారంభించాయని, కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించారు. పరగ్వాల్ సెక్టార్‌లోని 10 పోలీసు పోస్టులు, 30 గ్రామాలను పాకిస్తాన్ బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయని బ్రిజిలాల్ చెప్పారు. సరిహద్దుల్లోని భద్రతపై కట్టుదిట్టమైన, దృఢమైన నిర్ణయాలు తీసుకుందామని పాకిస్తాన్ మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్.. మే 29న భారత్‌కు పిలుపునివ్వడం గమనార్హం. కాల్పులతో దిన దిన గండంగా బతుకున్న సరిహద్దు ప్రజల కష్టాలను తొలగిద్దామని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ పిలుపుపై భారత్ సానుకూలత వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో శాంతి స్థాపన కోసం చర్చలకు సిద్ధమని తెలిపింది. అయితే, ప్రతిసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తూ, శాంతియుత వాతావరణానికి తావులేకుండా చేస్తోంది. -
సిరియాలో మరణ మృదంగం
-
పాక్ ఉన్మాదం ; సరిహద్దు గ్రామాల్లో అప్రమత్తత
పూంఛ్ : యుద్ధోన్మాదంతో పేట్రేగుతోన్న పాకిస్తాన్.. భారత పల్లెలే లక్ష్యంగా దాడులు జరుపుతున్నది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని మీరి గడిచిన మూడురోజుల్లో పలుమార్లు కాల్పులకు పాల్పడింది. దీంతో అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ), సరిహద్దు నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి భయానకవాతావరణం నెలకొంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కీలకమైన ఐదు జిల్లాల్లో బార్డర్‌కు దగ్గరగా ఉన్న పాఠశాలలను శనివారం నుంచి మూయించారు. ‘జమ్ము, సాంబా, కథువా, రాజౌరీ, పూంఛ్ జిల్లాల్లో సరిహద్దును ఆనుకుని ఉన్న స్కూళ్లన్నింటినీ మూసేశాం. వచ్చే మూడురోజుల వరకు వాటిని తెరవకూడదని సిబ్బందిని ఆదేశించాం. పరిస్థితిని బట్టి మరోమారు ఆదేశాలు జారీచేస్తాం’ అని అధికారులు మీడియాకు చెప్పారు. మూడురోజుల్లో 9 మంది మృతి : భారత పల్లెలే లక్ష్యంగా పాక్ బలగాలు జరుపుతోన్న కాల్పుల్లో ఇప్పటివరకు తొమ్మిదిమంది చనిపోయారు. వారిలో ఐదుగురు సాధారణ పౌరులుకాగా, ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు, ఇద్దరు ఆర్మీ సిబ్బంది ఉన్నారు. ఇటీవల భారత సైన్యం మినీ సర్జికల్ స్ట్రైక్ చేసి పాక్ బలగాల్ని మట్టుపెట్టిన తర్వాత సరిహద్దులో మళ్లీ యుద్ధవాతావరణం నెలకొంది. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలపై ఇరుదేశాలూ ఆయా రాయబారులకు నిరసనలు తెలిపాయి. -
కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘన
-
పాక్ సైనిక మరణాల సంఖ్య పెరగనంత వరకు...
భోపాల్ : పాకిస్తాన్ సైనికుల మరణాల సంఖ్య పెరగనంత వరకు ఇస్లామాబాద్‌కు బుద్ధి రాదని ప్రముఖ రక్షణ నిపుణుడు, మేజర్ రిటైర్డ్ జనరల్ ఎస్ఆర్ సిన్హో అన్నారు. ఒకవేళ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఇలానే ఉల్లంఘిస్తూ ఉంటే, భారత ఆర్మీ పాకిస్తానీ బోర్డర్ పోస్టులపై దాడులు జరపాలని ఎస్ఆర్ సిన్హో పిలుపునిచ్చారు. పాకిస్తాన్‌కు కొత్త ఆర్మీ చీఫ్‌ను ఎంపికయ్యాక, కాల్పుల విమరణ ఒప్పంద ఉల్లంఘన ఘటనలు తగ్గుతాయని భారత్ భావించిందని, కానీ అది జరుగడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పాకిస్తాన్ మాజీ ఆర్మీ చీఫ్, ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను తన చెప్పుచేతల్లో నడిపేవారని, ఆయన ఏది అనుకుంటే అది జరిగేదని చెప్పారు. కొత్త ఆర్మీ చీఫ్ ఎంపికతో నవాజ్ షరీఫ్ కొంత ఉపశమనం పొందుతారని ఆశించామని, కానీ మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన జరుగుతుందన్నారు. కశ్మీర్ సమస్య పరిష్కారం కానంతవరకు నియంత్రణ రేఖ వెంబడి ఈ కాల్పులు జరుగుతూనే ఉంటాయని భావిస్తున్నానని పేర్కొన్నారు. ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్ చాలదని, పాకిస్తాన్ ఆర్మీ పోస్టులపై కూడా భారత ఆర్మీ దాడులు జరపాలని సూచించారు. ఇది వారికి, వారి ప్రభుత్వానికి ఎలాంటి ప్రభావం చూపదన్నారు. మూడు వారాల ప్రశాంతత అనంతరం పాకిస్తానీ దళాలు మళ్లీ డిసెంబర్ 16న జమ్మూకశ్మీర్ పూంచ్ సెక్టార్‌లోని భారత ఆర్మీ పోస్టులపై దాడులు జరిపిన సంగతి తెలిసిందే. మళ్లీ మళ్లీ పాకిస్తాన్ తెగబడుతుండటంతో రక్షణ నిపుణుడు ఈ మేరకు సూచనలు చేశారు. -
పిరికిపందలే ఇలా దాడి చేస్తారు: రాజ్ నాథ్
న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి దాడులకు తెగబడుతున్న పాకిస్తాన్ చర్యలపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మండిపడ్డారు. గ్రేటర్ నోయిడాలో ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్(ఐటీబీపీ) 55వ వ్యవస్థాపక దినోత్సవంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. భారత్ ను దెబ్బతీసేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆశ్రయించడాన్ని పిరికిపందల చర్యగా ఆయన అభివర్ణించారు. దాయాది దేశం ఎప్పుడూ ఇదే తరహాలో ఉగ్రచర్యలకు పాల్పడుతుందని, పిరికివాళ్లే టెర్రరిజాన్ని ఆయుధంగా చేసుకుని దాడులు చేస్తారని అన్నారు. ధైర్యవంతులు ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడరని, పాక్ మాత్రం భారత్ ను ఏదో రకంగా దెబ్బతీయాలని విశ్వప్రయత్నాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ సక్సెస్ సాధిస్తున్న దేశాలలో భారత్ ఒకటని రాజ్ నాథ్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న జమ్ముకశ్మీర్ ఉడీలో ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడి తర్వాత పాక్ తన దాడులను మరింతగా కొనసాగిస్తుందని చెప్పారు. పాక్ పై భారత ఆర్మీ మొదటగా కాల్పులు జరపదని, ఒకవేళ దాయాది దేశం దాడులకు పాల్పడితే మాత్రం ధీటుగా జవాబిస్తామని రాజ్ నాథ్ తెలిపారు. భారత్ అదుపులోకి తీసుకున్న పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి విషయంపై మీడియా ప్రశ్నించగా.. ప్రభుత్వం ఈ తప్పక చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. జమ్ముకశ్మీర్ లోని పూంఛ్ జిల్లా బాలాకోట్ సెక్టార్ వద్ద శుక్రవారం వేకువజామున బీఎస్ఎఫ్ బలగాలు జరిపిన దాడిలో ఏకంగా 15 మంది పాక్ జవాన్లు హతమైన విషయం తెలిసిందే. -
ఎదురుకాల్పుల్లో 15 మంది పాక్ జవాన్లు హతం
-
ఎదురుకాల్పుల్లో 15 మంది పాక్ జవాన్లు హతం
శ్రీనగర్: సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత భారత్ చేతిలో పాకిస్థాన్ మరో దారుణ పరాభవాన్ని చవిచూసింది. నియంత్రణ రేఖ(ఎల్ వోసీ) వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్ కు శుక్రవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జమ్ముకశ్మీర్ లోని పూంఛ్ జిల్లా బాలాకోట్ సెక్టార్ వద్ద బీఎస్ఎఫ్ బలగాలు జరిపిన దాడిలో ఏకంగా 15 మంది పాకిస్థానీ జవాన్లు హతమైనట్లు తెలిసింది. ఎడతెరపి లేకుండా కాల్పులకు పాల్పడుతోన్న పాకిస్థాన్ ను నిలువరించే క్రమంలో భారత జవాన్లు ఎదురు కాల్పులు జరిపారని బీఎస్ఎఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ సోమవారం మీడియాకు వెల్లడించారు. అయితే కాల్పుల్లో ఎంతమంది పాక్ జవాన్లు చనిపోయారన్నది ఇప్పుడే చెప్పలేమని, సుమారు 15 మంది చనిపోయిఉండొచ్చని భావిస్తున్నట్లు అరుణ్ పేర్కొన్నారు. భారత జవాన్లలో ఏఒక్కరూ గాయపడలేదని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది. -
భారత హైకమిషనర్‌కు పాక్ సమన్లు
ఇస్లామాబాద్: వాస్తవాధీన రేఖ(ఎల్వోసీ) వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ తూట్లు పొడుస్తోందని, భారత బలగాలు జరిపిన కాల్పుల్లో ఒక జవాను, మరో పౌరుడు చనిపోయారని, ఈ విషయమై వివరణ ఇవ్వాల్సిందిగా ఇస్లామాబాద్ లోని భారత డిప్యూటీ హైకమిషనర్ జేపీ సింగ్ కు మంగళవారం పాక్ ప్రభుత్వం సమన్లు జారీచేసింది. వాస్తవాధీన రేఖను ఆనుకుని బజ్వత్, చాప్రా, హర్పాల్, సుచేత్ ఆఘర్, చార్వా సెక్టార్లపై భారత్ విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతోందని పాక్ ఆరోపించినట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధులు తెలిపారు. కాల్పుల వ్యవహారంపై భారత్ కు తీవ్ర నిరసన తెలిపిన పాక్.. ఆ మేరకు వివరణ కోరిందని పేర్కొన్నారు. 2016లో భారత్ 90 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడిందని, పాకిస్థాన్ ఒక్కసారికూడా ఆ పని చేయలేదనిగతవారం దాయాది విదేశాంగ ప్రతినిధి నఫీజ్ జకారియా వ్యాఖ్యానించారు. -
29సార్లు ఉల్లంఘనకు పాల్పడిన పాకిస్తాన్
న్యూఢిల్లీ : పాకిస్తాన్ యథేచ్చగా కాల్పలు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం పాకిస్తాన్ ఇప్పటివరకూ 29సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించింది. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా, రాజౌరి సెక్టార్ల్లో పాక్ బలగాలు గతరాత్రి కాల్పులకు పాల్పడ్డాయి. అయితే అప్రమత్తంగా ఉన్న భద్రతా సిబ్బంది సమర్ధవంతంగా తిప్పికొట్టాయి. కాల్పుల్లో ఓ జవాను గాయపడినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. మూడు రోజుల వ్యవధిలో పాక్ కాల్పులు జరపడం ఇది రెండోసారి. కాగా సర్టికల్ స్ట్రైక్స్ దాడుల నేపథ్యంలో పలుమార్లు పాక్ తన దుర్భిద్ధిని ప్రదర్శించింది. పూంఛ్, రాజౌరీ, ఝానగర్, మక్రీ, నౌషెరా, గిగ్రియల్, ప్లాటాన్, పుల్వామా, బల్లోయ్, కృష్ణగాటి తదితర ప్రాంతాల్లో కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. మరోవైపు పాక్ కాల్పుల నేపథ్యంలో సరిహద్దు గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. కాల్పుల మోతలో పరిసర ప్రాంతాలు తరచు దద్దరిల్లుతున్నాయి. -
మళ్లీ యూరిలో బరితెగించిన పాకిస్థాన్!
18 మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న యూరి ఉగ్రవాద దాడి నేపథ్యంలో దాయాది పాకిస్థాన్ కు దీటుగా జవాబు చెప్పేందుకు భారత్ సన్నద్ధమవుతున్న తరుణంలోనే ఆ దేశం మరోసారి రెచ్చగొట్టే చర్యలకు దిగింది. యూరి సెక్టర్లో దాయాది సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. చిన్నస్థాయి ఆయుధాలతో భారత ఆర్మీ పోస్టు లక్ష్యంగా 20 రౌండ్లు కాల్పులు జరిపింది. దీంతో భారత సైన్యం దీటుగా బదులు ఇచ్చింది. కాగా, యూరి సెక్టర్లో మంగళవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. లాచిపుర ప్రాంతంలో దాడులకు దిగిన ఉగ్రవాదులను భారత సైన్యం ఏరిపారేసింది. ఈ ఎన్కౌంటర్లో పదిమంది ఉగ్రవాదులు మరణించినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. యూరి ఉగ్రవాద దాడితో రగిలిపోతున్న భారత్.. 26/11 ముంబై దాడుల అనంతరం పాకిస్థాన్‌ను ఏవిధంగా అయితే అంతర్జాతీయంగా ఇరకాటంలో పెట్టిందో ఇప్పుడు కూడా అదేవిధంగా పాక్ ను ఏకాకిని చేయాలని నిశ్చయించింది. దౌత్యపరంగా, ఆర్థికంగా, సైనికంగా పాక్ కు దీటుగా బదులు చెప్పేందుకు వ్యూహం రచించాలని ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించింది. భారత భూభాగంలో ఉగ్రవాద దాడులను ప్రేరేపిస్తున్న పాకిస్థాన్ తీరును అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్న తరుణంలో సరిహద్దుల్లో మళ్లీ పాక్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడటం గమనార్హం. యూరి ఉగ్రవాద దాడి నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లోని పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. -
బాంబుల మోత మధ్య బార్డర్ సెల్ఫీలు!
జమ్ము: అది జమ్ములోని సరిహద్దు ప్రాంతం. అక్కడ నిర్విరామంగా తుపాకుల మోత మోగుతూనే ఉంటుంది. ఇరువైపుల సైనికులు ప్రయోగించే షెల్స్, బాంబులతో దద్దరిల్లుతుంటుంది. ఈ కాల్పుల బారి నుంచి తప్పించుకునేందుకు స్థానకులే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తుండగా.. పర్యాటకులు మాత్రం సరిహద్దు అందాలను తిలకించేందుకు సాహసిస్తున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో సెల్ఫీలు దిగి మురిసిపోతున్నారు. పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరణమ ఉల్లంఘనకు పాల్పడుతున్నప్పటికీ.. గత రెండేళ్లలో జమ్ములోని ఆర్ఎస్ పుర సెక్టర్లో అంతర్జాతీయ సరిహద్దులను దర్శించేందుకు వందలమంది పర్యాటకులు తరలివస్తున్నారు. దీంతో ఇక్కడ పర్యాటకం నానాటికీ వృద్ధి చెందుతున్నది. ఉత్తరాఖండ్‌కు చెందిన షెల్జా కుటుంబం కూడా ఆర్ఎస్ పురలోని అంతర్జాతీయ సరిహద్దును సందర్శించారు. ఈ అనుభవం గురించి ఆమె చెప్తూ.. 'అదొక కన్నులపండుగలాంటి దృశం. సరిహద్దు కంచె వద్ద నిలబడి మేం సెల్ఫీలు దిగాం. భారత్, పాకిస్థాన్ బంకర్లు, వాటిపై ఎగురుతున్న జెండాలను చూశాం. ఇదెంతో బాగా అనిపించింది. పాకిస్థాన్ టూరిస్టులు కూడా ఇలా సరిహద్దులను సందర్శించేందుకు వస్తే బాగుంటుందనిపించింది' అని చెప్పారు. ఆర్ఎస్ పుర సెక్టర్లో గతవారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సరిహద్దు కంచెకు మరమ్మతులు చేస్తున్న భద్రతా సిబ్బంది, కార్మికులపై పాకిస్థాన్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఒక పౌరుడు మరణించగా, 12 మంది గాయపడ్డారు. దీంతో దాదాపు 300 మంది స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. అయినా పర్యాటకులు మాత్రం ఇక్కడికి రావడం ఆపడం లేదు. -
పాక్ హైకమిషనర్ కు భారత్ సమన్లు
శ్రీనగర్ : కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, జమ్ముకాశ్మీర్ లో కాల్పులు జరిపినందుకు పాకిస్తాన్ హైకమిషనర్ అబ్దుల్ బసీద్ కు ఆదివారం భారత్ సమన్లు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లా సరిహద్దుల్లో పాక్ బలగాలు శనివారం జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు ఆరుగురు మరణించారు. పాక్ బలగాల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. దీంతో మృతుల సంఖ్య ఆరుగురికి చేరింది. శనివారం పాక్ బలగాలు పూంచ్ సరిహద్దుల్లో కాల్పులు జరిపింది... ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా...తీవ్రగాయాలైన మరో ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారు. పాక్ బలగాలు సరిహద్దు వద్ద భారత్ బలగాలనే లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడుతూ.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తన తెంపరితనాన్ని చాటుకుంటుంది. -
పాక్ కాల్పులపై స్పందించిన మోడీ!
-
పాక్ కాల్పులపై తొలిసారిగా స్పందించిన మోడీ
న్యూఢిల్లీ: భారత్ సరిహద్దు వెంబడి పాక్ కాల్పులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తొలిసారిగా స్పందించారు. సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు త్వరలోనే సర్థుకుంటాయని మోడీ తెలిపారు. అంతకుమందు హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని మోడీతో సమావేశమైయారు. భారత్ సరిహద్దు వెంబడి పాక్ కాల్పులపై తాజా పరిస్థితిని ఆయన మోడీకి వివరించారు. ఇటీవల పాక్ కాల్పుల్లో ఏడుగురు మరణించగా, పలువురు గాయపడని సంగతిని ఈ సందర్బంగా మోడీకి రాజ్‌నాథ్ విశదీకరించారు. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తరుచుగా ఉల్లంఘిస్తుంది. దీంతో భారత్ సరిహద్దు వెంబడి పలువురు మరణించగా, మరికొందరు గాయపడుతున్నారు. ఈ కాల్పుల్లో ఆస్తి నష్టం కూడా సంభవిస్తుంది. -
మన సైన్యం సిద్ధంగా ఉంది: జైట్లీ
న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గర్హించారు. పాక్ కుతంత్రాలను తిప్పికొట్టేందుకు భారత సైన్యం సర్వ సన్నద్దంగా ఉందని తెలిపారు. సరిహద్దు వెంబడి దాయాది దేశం సాగిస్తున్న దాడులకు మన రక్షణ దళాలు తగినరీతిలో స్పందించాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ దాడులు జరపడాన్ని ఆయన తప్పుబట్టారు. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సాగిస్తున్న మారణకాండలో అమాయకపౌరులు బలౌతున్నారని జైట్లీ ఆవేదన వ్యక్తం చేశారు. -
పాక్ కాల్పులను తిప్పి కొట్టిన భారత్
జమ్మూకాశ్మీర్: పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పర్గ్వాల్ సెక్టార్‌లోని 3 బీఎస్ఎఫ్ బలగాల శిబిరాలపై పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. దాంతో భారత్ సైన్యం వెంటనే స్పందించి ... పాక్ బలగాలపైకి దీటుగా కాల్పులు జరిపింది. దాంతో భారత్, పాక్ దేశాల మధ్య హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే పాక్ కాల్పుల వల్ల భారత్ వైపు ఎటువంటి నష్టం జరగలేదని సమాచారం. భారత్ - పాక్ దేశాల మధ్య ప్లాగ్ మీటింగ్ జరిగిన కొద్ది గంటలకే ఈ కాల్పులు జరగడం గమనార్హం. గత రెండు వారాల్లో ఇప్పటి వరకు పాక్ 20 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. -
'పాక్ కవ్వింపు చర్యలకు సమాధానమిచ్చే సత్తా ఉంది'
శ్రీనగర్: నియంత్రరణ రేఖ వద్ద తరచు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్తాన్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టే సత్తా భారత సైనిక దళాలకు ఉందని రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. రక్షణ మంత్రిగా తొలిసారి అయన శనివారం జమ్మూకాశ్మీర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాక్ కాల్పుల ఉల్లంఘన చర్యలను తిప్పికొట్టే సత్తా భారత్ కు ఉందని తెలిపారు. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం అంశానికి సంబంధించి పరిపాలన, పోలీస్, ఆర్మీ, పారా మిలటరీలకు చెందిన అధికారులతో జైట్లీ సమావేశం కానున్నారు. ఈ రోజు జైట్లీ పర్యటనలో సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ బిక్రమ్ సింగ్ కూడా పాల్గొన్నారు. ఎల్ఓసీపై రక్షణ చర్యలు, రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితికి సంబంధించి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, సీనియర్ సైన్యాధికారులతో జైట్లీ వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఎల్ఓసీపై ఇటీవల పాకిస్తాన్ జరిపిన కాల్పుల వివరాల్ని ఈ సందర్భంగా రక్షణ మంత్రికి ఆర్మీ అధికారులు వివరించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ శుక్రవారం భారత సైనిక కేంద్రాలపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. -
పాక్ మళ్లీ కాల్పుల ఉల్లంఘన : ఆర్మీ అధికారి మృతి
శ్రీనగర్ : భారత్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. కాశ్మీర్‌లోని యురి సెక్టార్లో పాక్ సైన్యం కాల్పుల్లో భారత్ సైనిక అధికారి మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం పాకిస్తాన్‌కు పరిపాటిగా మారిపోయింది. భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య ఎలాంటి కాల్పులు ఉండకూడదంటూ 2003 నవంబర్ నెలలో ద్వైపాక్షిక కాల్పుల విరమణ ఒప్పందం ఒకటి కుదిరింది. అయితే దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండానే పాక్ దళాలు పదే పదే కాల్పులకు పాల్పడుతోంది. నియంత్రణ రేఖ వద్ద, జమ్ము కాశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్ దళాలు కాల్పులకు పాల్పడుతున్నట్లు భారత నిఘా సంస్థలు చెబుతున్నాయి. -
పాక్ మరో సారి కాల్పుల ఉల్లంఘన : జవాన్ మృతి
భారత్- పాక్ సరిహద్దుల్లో కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే పర్యటించి 24 గంటలు గడవ లేదు. పాక్ మరోసారి భారత్ సరిహద్దుల్లోని ఆర్ ఎస్ పురా, పర్గవాల్ సెక్టార్‌లోని బీఎస్ఎఫ్ పోస్ట్‌లు, గ్రామాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపింది. ఆ ఘటనలో బీఎస్ఎఫ్ జవాన్ మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం అర్థరాత్రి నుంచి దాదాపు ఆరు గంటల పాటు పాక్ బలగాలు ఎడతెరిపి లేకుండా కాల్పులు జరిపారని సీనియర్ పోలీసు అధికారి బుధవారం వెల్లడించారు. క్షతగాత్రులు మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఇరుదేశాల సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ సమీపంలోని భారత్ భూభాగంపై పాక్ భద్రతా దళాలు తరుచుగా కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. అంతేకాకుండా భారత్‌లో పాక్ తీవ్రవాదుల చోరబాట్లు అధికమైనాయి. ఈ నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి షిండే భారత్, పాక్ సరిహద్దుల్లో మంగళవారం పర్యటించిన సంగతి తెలిసిందే. అలాగే స్థానిక భద్రత దళ ఉన్నతాధికారులతో ఆయన పరిస్థితిని సమీక్షించారు. అందులోభాగంగా బీఎస్ఎఫ్ సిబ్బందితో షిండే ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 200 సార్లకు పైగా పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించిందని ఈ సందర్భంగా షిండే తెలిపారు. -
జమ్మూ కాశ్మీర్లో చోరబాట్లపై కేంద్రం ఆందోళన
జమ్మూ కాశ్మీర్లో అక్రమంగా ప్రవేశిస్తున్న చోరబాటుదారులు సంఖ్య ఈ ఏడాది గణనీయంగా పెరగడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది చోరబాట్ల సంఖ్య అంత లేవు, కానీ ఈ ఏడాది ఆ సంఖ్య అధికం కావడం పట్ల కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తీవ్ర కలత చెందుతున్నట్లు వెల్లడించారు. భారత్, పాక్ దేశాల సరిహద్దు ప్రాంతమైన నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)లో షిండే మంగళవారం పర్యటించారు. ఈ సందర్బంగా సాంబ సెక్టర్లోని భద్రత దళాలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... చోరబాట్ల సంఖ్య అధికమవడానికి గల కారణాలపై తమ శాఖ ఉన్నతాధికారులతో చర్చిస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. 2003లో భారత్ - పాక్ దేశాల మధ్య చేసుకున్న కాల్పుల ఉల్లంఘన ఒప్పందాన్ని పాక్ తరుచుగా ఉల్లంఘిస్తుంది. అయితే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 136 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించింది. దాంతో ఆ అంశంలో జోక్యం చేసుకోవాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దీంతో షిండే మంగళవారం భారత్, పాక్ సరిహద్దుల్లో పర్యటిస్తున్నారు. అలాగే సరిహద్దుల్లోని పహారా కాస్తున్న సెంట్రల్ ఆర్మడ్ పోలీసు ఫోర్స్ (సీఏపీఎఫ్) సిబ్బందికి మాజీ సైనికుల హోదా కల్పించేందుకు కృషి చేస్తానని షిండే ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రధానితో సమావేశమై ఈ అంశంపై చర్చిస్తానని సీఏపీఎఫ్ సిబ్బందికి భరోసా ఇచ్చారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల నాటికి ఆ విషయం బిల్లుగా రూపాంతరం చెందుతుందని షిండే ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఎల్ఓసీలో పర్యటించనున్న హోం మంత్రి షిండే
పొరుగుదేశం పాకిస్థాన్ గతంలో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమిస్తున్న నేపథ్యంలో భారత హోంశాఖ మంత్రి సుశీష్ కుమార్ షిండే మంగళవారం నియంత్రణ రేఖ (ఎల్ఒసీ) వెంబడి పర్యటించనున్నారు. అందుకోసం ఈ రోజు ఉదయం న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో జమ్మూ కాశ్మీర్ చేరుకుంటారు. ఎల్ఓసీ వెంబడి భద్రత పరిస్థితులను ఈ సందర్బంగా షిండే ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి సరిహద్దు రేఖ వెంబడి తరచుగా పాకిస్థాన్ భద్రత దళాలు కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో జోక్యం చేసుకోవాలని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కేంద్రాన్ని కోరారు. ఈ సందర్భంగా షిండే భారత్, పాక్ సరిహద్దుల్లోని ఎల్ఓసీ వెంబడి ఈ రోజు పర్యటించనున్నారు. 2003లో భారత్, పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అయితే ఈ ఏడాది జనవరి నుంచి నేటి వరకు 136 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించిన సంగతి తెలిసిందే.