సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత భారత్ చేతిలో పాకిస్థాన్ మరో దారుణ పరాభవాన్ని చవిచూసింది. వాస్తవాధీన రేఖ(ఎల్ వోసీ) వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్ కు శుక్రవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జమ్ముకశ్మీర్ లోని పూంఛ్ జిల్లా బాలాకోట్ సెక్టార్ వద్ద బీఎస్ఎఫ్ బలగాలు జరిపిన దాడిలో ఏకంగా 15 మంది పాకిస్థానీ జవాన్లు హతమైనట్లు తెలిసింది.