పాక్ హైకమిషనర్ కు భారత్ సమన్లు | India summons Pakistan High Commissioner to lodge protest over ceasefire violations | Sakshi
Sakshi News home page

పాక్ హైకమిషనర్ కు భారత్ సమన్లు

Published Sun, Aug 16 2015 2:57 PM | Last Updated on Sun, Sep 3 2017 7:33 AM

పాక్ హైకమిషనర్ కు భారత్ సమన్లు

పాక్ హైకమిషనర్ కు భారత్ సమన్లు

శ్రీనగర్ : కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, జమ్ముకాశ్మీర్ లో కాల్పులు జరిపినందుకు పాకిస్తాన్ హైకమిషనర్ అబ్దుల్ బసీద్ కు ఆదివారం భారత్ సమన్లు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లా సరిహద్దుల్లో పాక్ బలగాలు శనివారం జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు ఆరుగురు మరణించారు. పాక్ బలగాల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. దీంతో మృతుల సంఖ్య ఆరుగురికి చేరింది.

శనివారం పాక్ బలగాలు పూంచ్ సరిహద్దుల్లో కాల్పులు జరిపింది...  ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా...తీవ్రగాయాలైన మరో ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారు. పాక్ బలగాలు సరిహద్దు వద్ద భారత్ బలగాలనే లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడుతూ.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తన తెంపరితనాన్ని చాటుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement