ఎల్ఓసీలో పర్యటించనున్న హోం మంత్రి షిండే
పొరుగుదేశం పాకిస్థాన్ గతంలో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమిస్తున్న నేపథ్యంలో భారత హోంశాఖ మంత్రి సుశీష్ కుమార్ షిండే మంగళవారం నియంత్రణ రేఖ (ఎల్ఒసీ) వెంబడి పర్యటించనున్నారు. అందుకోసం ఈ రోజు ఉదయం న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో జమ్మూ కాశ్మీర్ చేరుకుంటారు. ఎల్ఓసీ వెంబడి భద్రత పరిస్థితులను ఈ సందర్బంగా షిండే ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు.
ఈ ఏడాది జనవరి నుంచి సరిహద్దు రేఖ వెంబడి తరచుగా పాకిస్థాన్ భద్రత దళాలు కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో జోక్యం చేసుకోవాలని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కేంద్రాన్ని కోరారు. ఈ సందర్భంగా షిండే భారత్, పాక్ సరిహద్దుల్లోని ఎల్ఓసీ వెంబడి ఈ రోజు పర్యటించనున్నారు.
2003లో భారత్, పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అయితే ఈ ఏడాది జనవరి నుంచి నేటి వరకు 136 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించిన సంగతి తెలిసిందే.