ఎదురుకాల్పుల్లో 15 మంది పాక్ జవాన్లు హతం
ఎదురుకాల్పుల్లో 15 మంది పాక్ జవాన్లు హతం
Published Fri, Oct 28 2016 1:44 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM
శ్రీనగర్: సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత భారత్ చేతిలో పాకిస్థాన్ మరో దారుణ పరాభవాన్ని చవిచూసింది. నియంత్రణ రేఖ(ఎల్ వోసీ) వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్ కు శుక్రవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జమ్ముకశ్మీర్ లోని పూంఛ్ జిల్లా బాలాకోట్ సెక్టార్ వద్ద బీఎస్ఎఫ్ బలగాలు జరిపిన దాడిలో ఏకంగా 15 మంది పాకిస్థానీ జవాన్లు హతమైనట్లు తెలిసింది.
ఎడతెరపి లేకుండా కాల్పులకు పాల్పడుతోన్న పాకిస్థాన్ ను నిలువరించే క్రమంలో భారత జవాన్లు ఎదురు కాల్పులు జరిపారని బీఎస్ఎఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ సోమవారం మీడియాకు వెల్లడించారు. అయితే కాల్పుల్లో ఎంతమంది పాక్ జవాన్లు చనిపోయారన్నది ఇప్పుడే చెప్పలేమని, సుమారు 15 మంది చనిపోయిఉండొచ్చని భావిస్తున్నట్లు అరుణ్ పేర్కొన్నారు. భారత జవాన్లలో ఏఒక్కరూ గాయపడలేదని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.
Advertisement