
మన సైన్యం సిద్ధంగా ఉంది: జైట్లీ
న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గర్హించారు. పాక్ కుతంత్రాలను తిప్పికొట్టేందుకు భారత సైన్యం సర్వ సన్నద్దంగా ఉందని తెలిపారు. సరిహద్దు వెంబడి దాయాది దేశం సాగిస్తున్న దాడులకు మన రక్షణ దళాలు తగినరీతిలో స్పందించాయని చెప్పారు.
ఇరు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ దాడులు జరపడాన్ని ఆయన తప్పుబట్టారు. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సాగిస్తున్న మారణకాండలో అమాయకపౌరులు బలౌతున్నారని జైట్లీ ఆవేదన వ్యక్తం చేశారు.