ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు అరెస్ట్ | Two BSF troopers arrested for molesting girl | Sakshi
Sakshi News home page

ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు అరెస్ట్

Published Fri, Oct 17 2014 6:52 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

Two BSF troopers arrested for molesting girl

అగర్తలా:ఓ దళిత యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లను అదుపులోకి తీసుకున్నారు. 13 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించినట్లు ఆరోపణల నేపథ్యంలో ఆ జవాన్లను అరెస్ట్ చేశారు. సరిహద్దు గ్రామమైన సిమ్నాలో విధులు నిర్వహిస్తున్న జవాన్లు ఆ బాలికను వేధించినట్లు ఫిర్యాదు నమోదు చేసుకున్న అధికారులు ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి ఆ బాలిక ఫిర్యాదు చేసినట్లు పోలీస్ అధికారి స్పష్టం చేశారు.  అంతకుముందు ఆ జవాన్లుపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

 

దీంతో పరిస్థితిని గమనించిన అధికారులు వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమైయ్యారు. ఇదిలా ఉండగా ఆటో డ్రైవర్ తో పాటు అతని స్నేహితుడు ఓ మహిళపై అత్యాచారం పాల్పడటంతో వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement