సాక్షి, రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో ఆదివారం భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. కాంకేర్ జిల్లాలోని అటవీప్రాంతంలో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక జవాన్ గాయపడ్డారు. గాయపడిన జవాన్‌ను హెలికాప్టర్ ద్వారా రాయపూర్ ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.
ఛత్తీస్‌గఢ్ నిఘా వర్గాల సమాచారం ప్రకారం సంఘటనాస్థలంలో ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతూనే ఉందని తెలుస్తోంది. కొద్దిసేపు కాల్పులకు విరామం ఇచ్చిన మావోయిస్టులు మళ్లీ మెరుపుదాడులు చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఘటన స్థలంలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. మరోవైపు దంతెవాడ జిల్లాలోనూ మవోయిస్టులు హింసకు దిగారు. పోలీసులకు సహకరిస్తున్నాడనే అనుమానంతో ఓ గ్రామ సర్పంచ్‌ను హతమార్చారు.
Comments
Please login to add a commentAdd a comment