Hero Ram Charan Inspiring Afternoon With BSF Jawans In Amritsar, Photos Viral - Sakshi
Sakshi News home page

Ram Charan - Jawans: జవాన్లతో రామ్‌చరణ్‌ ఫొటోలు

Published Wed, Apr 20 2022 12:11 PM | Last Updated on Wed, Apr 20 2022 1:13 PM

Ram Charan Inspiring Afternoon With BSF Jawans In Amritsar - Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ రేంజ్‌ పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో అతడి యాక్టింగ్‌ స్కిల్‌ను జనాలు ఫిదా అయ్యారు. ప్రస్తుతం చెర్రీ శంకర్‌ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులో బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ కోసం అతడు కొంత కాలంగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం షూటింగ్‌ గ్యాప్‌లో ఆయన కొంత సమయాన్ని బీఎస్‌ఎఫ్‌ జవాన్లతో గడిపారు.

ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఖాసా అమృత్‌సర్‌లోని బీఎస్‌ఎఫ్‌ క్యాంప్‌లో జవాన్ల కథలు, త్యాగాలు, వాళ్ల అంకిత భావం గురించి వింటూ స్ఫూర్తిదాయకమైన మధ్యాహ్నపు సమయాన్ని గడిపాను అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. ఈ మేరకు వారితో దిగిన కొన్ని ఫొటోలను షేర్‌ చేశాడు. ఇందులో వారితో కలిసి భోజనం కూడా చేసినట్లు తెలుస్తోంది.

చదవండి: అంటే సుందరానికీ టీజర్‌ చూశారా? ఫుల్‌ ఫన్‌ గ్యారంటీ!

 ఈ వారం థియేటర్‌, ఓటీటీలో రిలీజవుతున్న సినిమాల లిస్ట్‌ ఇదిగో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement