
మల్కన్‌గిరి: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో కనిమెల సమితి, చింతాలవడా గ్రామపంచాయితీలోని చింతాలవాడ వంతెన నిర్మాణం చేపట్టాలని సర్పంచ్ పదయమాడి అధికారులను కోరారు. ఏడేళ్లుగా ఇక్కడి సగం విరిగిపోయిన వంతెన మీదుగా ప్రమాదకరమైన ప్రయాణాలు సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల సమయంలో వంతెన విరిగిపోయిన భాగాలు నీటిలో ఎక్కడున్నాయో తెలియకపోవడంతో ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడుతున్నారని వాపోయారు.
ఇదే మార్గం గుండా సిందిగుఢ, కోపలకొండ, పేడకొండ, పులిమెట్ల, తటిగుఢ, ఎంవీ–13, గుముక, మందపల్లి గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారని వివరించారు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ వంతెన నిర్మాణం చేపట్టాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు వచ్చి, వంతెన పునర్నిర్మాణానికి సహకరించాలని ఆమె కోరారు.
Comments
Please login to add a commentAdd a comment