మల్కాన్గిరికి వెళ్లనున్న ఓయూ జేఏసీ
Published Thu, Nov 3 2016 2:50 PM | Last Updated on Tue, Oct 9 2018 2:39 PM
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల విద్యార్థులు మల్కాన్‌గిరి ఎన్‌కౌంటర్ ప్రాంతానికి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని ఓయూ జాక్ ఫర్ సోషల్ జస్టిస్ గురువారం ప్రకటించింది. ఏవోబీ జరిగిన ఎన్‌కౌంటర్‌ను బూటకమైనదిగా జేఏసీ అభివర్ణించింది. అన్ని యూనివర్సిటీల పరిశోధన విద్యార్థులు ఈ నెల 6వ తేదీన అక్కడికి వెళ్లి ఘటనపై నిజనిర్ధారణ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు చనిపోయిన మావోయిస్టులు మరియు పోలీసు కుటుంబాల వారితో మాట్లాడనున్నట్లు తెలిపింది. భూటకపు ఎన్‌కౌంటర్‌పై రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. త్వరలోనే హైదరాబాద్‌లో మానవహక్కుల సంఘాలతోపాటు ప్రజా సంఘాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటుచేయనున్నట్లు జాక్ తెలిపింది.
Advertisement
Advertisement