ఒరిస్సాలో 8 మంది మావోయిస్టులు లొంగుబాటు | Eight Maoists surrender in Odisha | Sakshi
Sakshi News home page

ఒరిస్సాలో 8 మంది మావోయిస్టులు లొంగుబాటు

Published Wed, Aug 14 2013 4:30 PM | Last Updated on Wed, Sep 26 2018 3:36 PM

Eight Maoists surrender in Odisha

ఒరిస్సాలోని ఎనిమిది మంది మావోయిస్టులు బుధవారం మల్కాన్గిరి జిల్లా ఎస్పీ అఖిలేశ్వర్ సింగ్ ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు. అయితే ఆ మావోయిస్టులందరిది మల్కాన్గిరి జిల్లాలోని అత్యంత మారుమూలప్రాంతమైన చిత్రకొండ ప్రాంతమని జిల్లా ఎస్పీ వివరించారు.

 

2009 నుంచి వారు మావోయిస్టు కార్యకలపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. మొత్తం ఎనిమిది మంది మావోయిస్టుల్లో ముగ్గురు ఏరియా దళ కామాండర్లుగా ఉన్నారని చెప్పారు.  లొంగిపోయిన మావోయిస్టులు ఈ సందర్భంగా ప్రసంగిస్తూ... తామంతా జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement