మల్కన్‌గిరి( భువనేశ్వర్): జిల్లాలోని కలిమెల సమితి, దుబేంకొండ గ్రామ వంతెన పూర్తిగా నేలమట్టమైంది. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ వంతెన లేకపోవడంతో మొత్తం 3 గ్రామాల ప్రజలు తమ రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ క్రమంలో వంతెన నిర్మాణం కోసం బాధిత గ్రామాల ప్రజలు పోరాడగా, సరిగ్గా ఏడాది క్రితం ఇక్కడి గెడ్డపై వంతెన నిర్మాణం చేపట్టారు.
దీంతో తమ కష్టాలు గట్టెక్కాయని అనుకునేలోపు ఇటీవల కురిసిన వర్షాలకు వంతెన ఇలా నేలకూలడం పట్ల గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించకపోవడం వల్లే ఇలా జరిగిందని, అధికారులు తక్షణమే స్పందించి, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని బాధిత గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment