ఇన్‌ఫార్మర్లకు సహ చట్టమా?
విశ్లేషణ
ఆదాయ పన్ను అధికారులనుంచే సమాచార హక్కు చట్టం కింద సమాచారం సేకరించి.. వారికే దాన్ని ఇచ్చి, బహుమతి సొమ్ము తీసుకుని బతకడం అంటే పది రూపాయలు ఖర్చుపెట్టి లక్షలు సంపాదించడం, ప్రజాప్రయోజనం కాదు.
సంపన్నుల ఆదాయపు పన్ను (ఆ.ప.) చెల్లింపు పత్రాలు అందరికీ ఇవ్వవల సిన పత్రాలు కాకపోయినా ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఎవరైనా అధికారికి, చట్టం కింద బాధ్యతలు నిర్వహించే వారికి ఇవ్వాలని నిర్ణయించే అధికారం ఆ.ప. అధికారు లకు ఉందని ఆదాయపన్ను చట్టం సెక్షన్ 138 వివరి స్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఎవరెవరికి వార్షిక ఆ.ప. పత్రాలు ఇవ్వాలో తెలిపే నోటిఫికేషన్లు ఎన్నో జారీ చేసింది. ఆ.ప. పత్రాలు సొంత సమాచారమే అయినప్పటికీ, ప్రజా శ్రేయస్సుకోసం సమాచారం ఇవ్వాలని సెక్షన్ 8(1)(జె)లో మినహాయింపు ఆదేశిస్తున్నది.
వందలాదిమంది సంపన్నులు ఇచ్చిన ఆ.ప. వార్షిక పత్రాల ప్రతులు ఇవ్వాలని ఒక గుప్త, స.హ. చట్టం కింద కోరారు. మొత్తం దస్తావేజులు చూపాలని, అడిగిన పత్రాల ప్రతులు ఇవ్వాలని అడిగారు. మరో దరఖాస్తులో ఢిల్లీ, కేంద్ర ఢిల్లీ, చండీగఢ్, ముంబైలో పనిచేసే సివిల్ ఆ.ప. అధికారులందరికి చెందిన పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని కోరారు. ఈ సమాచారం ఇవ్వాలంటే మొత్తం అరడజను కార్యాలయాల్లోని కొన్ని లక్షల దస్తావేజుల ప్రతులు తయారు చేయా ల్సిందే. అధికారుల ఆదాయాలు, ఆస్తులు, వారి జీవన భాగస్వాముల ఆస్తులు ఓ లెక్క పత్రం లేకుండా టన్ను లకొద్దీ కాగితాలను అడిగాడీ మహానుభావుడు. 101 మంది అధికారుల సమాచారం, ఆగస్టు 2003 నుంచి సెప్టెంబర్ 2005 దాకా పనిచేసిన అధికారులు లేదా 2005 నుంచి జవాబు ఇచ్చేనాటికి ఉన్న అందరు అధి కారుల సమాచారం ఇవ్వాలని అడిగాడు.
అడ్డూ అదుపూ లేకుండా అనంత సమాచారం కోసం ఓ పదిరూపాయలు ఇచ్చి గాలం వేసాడీ గుప్త. నిజానికి ఈయన ఎంత అడిగారో లెక్కించడం సాధ్యం కాదు. అతనూ అంచనా చేయలేడు. ఇందుకు సిగ్గు పడ కపోవడం విచిత్రం. ఈ దరఖాస్తు చదవడమే హింస. వేధింపు. తానెవరన్నది తానే చెప్పుకున్నాడు. ఇన్‌ఫా ర్మర్ అట. అంటే పన్ను ఎగవేత రహస్య సమాచారం చెప్పి బహుమతి సొమ్ము తీసుకునే వృత్తి ఈయనది. ఈ విధంగా కొందరు ఇన్‌ఫార్మర్లు తమకు ఇవ్వవలసిన బహుమతి సొమ్ము ఇవ్వలేదని కోర్టులో దావా వేశారు. బహుమతి సొమ్ము హక్కు కాదని, వారిచ్చిన సమా చారం నిజంగా పన్ను ఎగవేతను అరికట్టి ప్రభుత్వానికి మేలు చేసినట్టయితేనే బహుమతి ఇస్తారని, అదీ 2.5 లక్షల రూపాయలకు మించబోదని ఆ.ప. ఉన్నతాధి కారులు 2015లో ఉత్తర్వులు జారీ చేశారు. పన్ను ఎగవేతదారులను పట్టుకుని పన్ను వసూలు చేరుుంచి దేశసేవ చేస్తున్నాడట.
ఇది ప్రజా ప్రయోజనమేనట. కనుక తానడిగిన సమాచారం కట్టలు కట్టలుగా గానీ సీడీలుగా గానీ సేకరించి ఇవ్వాలట. స.హ. చట్టం సెక్షన్ 11(2) ప్రకారం మీ సమా చారం అడుగుతున్నారు మీరేమంటారు అంటూ సమా చార అధికారి సంప్రదింపు ఉత్తరాలు రాశారు. వారంతా ఇది తమ సొంత సమాచారమనీ ఎవరికీ ఇవ్వకూడదని అభ్యంతరం చెప్పారు. దాంతో సమా చార అధికారి సమాచారం ఇవ్వలేదు.
ఆ.ప. అధికారులనుంచే సహ చట్టం కింద సమా చారం వసూలుచేసి వారికే దాన్ని ఇచ్చి, బహుమతి సొమ్ము తీసుకుని బతకడం ఈయన వృత్తి అంటే, పదిరూపాయలు ఇచ్చి లక్షలు సంపాదిస్తాననడం, అదే ప్రజాప్రయోజనం అనడం సమంజసమా? తప్పించు కునే ఎగవేతదారుల రహస్య సమాచారం ఇవ్వడానికి బహుమతులు కాని, ఈవిధంగా స.హ. చట్టాన్ని వాడు కునే వృత్తిని రూపొందించడానికి కాదు. పన్ను చెల్లిం చని చీకటి ఆదాయాన్ని వెల్లడించడం అంటే ఇది కాదు. ఇది కేవలం దుర్మార్గం. ఇటువంటి దరఖాస్తులు లెక్కకు అందనన్ని విసురుతున్నాడీ మహానుభావుడు. అప్పీలు విచారణలో కూడా ఈ వ్యక్తి తన దుర్మార్గపు ప్రవర్తనను చాటుకున్నాడు. ఎవరన్నా అతనికి గౌరవం ఉన్నట్టు లేదు. సమాచారం ఇస్తావా? చస్తావా? అనే ధోరణిలో అతను వ్యవహరించడం దారుణం.
ఇదివరకు ఈ గుప్త దరఖాస్తులను స్వీకరించి సీఐసీ కొంత సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కాని ఇది అన్యాయమని ఢిల్లీ హైకోర్టును ఆశ్ర రుుస్తే, ఆ ఆదేశాలు చెల్లవని, ఇతనికి ఈ విధంగా సమాచారం అడిగే హక్కులేదని కోర్టు తీర్పు ఇచ్చింది. ఇష్టం వచ్చినట్టు బుర్రకు తోచినట్టు సమాచారం అడగడం పారదర్శకతకు సంబంధంలేని వ్యవహార మని, పాలన అభివృద్ధి చేయడానికి అవసరమైన పార దర్శకత కోసం వచ్చిన చట్టాన్ని పాలనను పక్కదారి పట్టించేందుకు అసలు ఏ పనీ చేయలేని విధంగా స్తంభింపజేసేందుకు వాడడం అసమంజసమని సుప్రీంకోర్టు సీబీఎస్‌ఈ వర్సెస్ ఆదిత్య బందోపా ధ్యాయ్ కేసులో 2011లో సమాచార హక్కు దుర్విని యోగాన్ని దుయ్యబట్టింది. ఇటువంటి సమాచారం అడగడమే కాకుండా అప్పీలు విచారించే న్యాయమూర్తి వంటి కమిషనర్‌పైన అవాకులు చవాకులు పేలి నిందలు వేసే వారిని స.హ. హక్కు నుంచి వెలివేసినా తప్పులేదని మద్రాస్ హైకోర్టు 2013లో తీర్పు ఇవ్వడా నికి ఇటువంటి వారే కారణం. సీఐసీ ఇద్దరు సభ్యుల పీఠం ఈ అప్పీళ్లను తిరస్కరించింది. (ఇఐఇ/ఈ/అ/20 11/002965 కేసులో తీర్పు ఆధారంగా)
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
ఈమెయిల్: professorsridhar@gmail.com