జిల్లాలోని ములుగు, ఏటూరునాగారం, గుండాల, ఆళ్లపల్లి, పినపాక, కామారం,టేకులపల్లి, ఇల్లం తదితర గ్రామాల్లో పోలీస్ ఇన్‌ఫార్మర్లుగా పనిచేస్తున్న పోలీసు ఇన్-ఫార్మర్లను చంపేస్తామని మావోలు పోస్టర్లు అంటించారు.
ఖమ్మం: జిల్లాలోని ములుగు, ఏటూరునాగారం, గుండాల, ఆళ్లపల్లి, పినపాక, కామారం,టేకులపల్లి, ఇల్లం తదితర గ్రామాల్లో పోలీస్ ఇన్‌ఫార్మర్లుగా పనిచేస్తున్న సనప నాగేష్ (కిశోర్) తదితరులను ప్రజాకోర్టులో హతమారుస్తామని మావోలు హెచ్చరించారు. ఈ విషయాన్ని గుండాల పరిసర ప్రాంతాల్లో మంగళవారం పోస్టర్లను అంటించారు. తెలంగాణ సర్కార్ చేపట్టిన మిషన్ కాకతీయ పథకం కమీషన్ కాకతీయగా మారిందని, పార్టీ నేతలకు, కాంట్రాక్టర్ల మేలుకే ఈ పనులు చేపట్టారని పేర్కొన్నారు. ఆదివాసి, దళిత ప్రజల పోడు భూములపై దళారుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అధిక వడ్డీలతో పేదలను ఇబ్బంది పెడుతున్న వడ్డీవ్యాపారులను ప్రజా కోర్టులో శిక్షిస్తామని హెచ్చరించారు.
Maoists, Threaten, Kill, Informers, మావోయిస్టులు, బెదిరింపు, ఇన్ ఫార్మర్లు