విజయనగరం జిల్లా సాలూరులో రీపోలింగ్‌పై ఎన్నికల సంఘం(ఈసీ)తన పొరపాటును సరిదిద్దుకుంది.
హైదరాబాద్: విజయనగరం జిల్లా సాలూరులో రీపోలింగ్‌పై ఎన్నికల సంఘం(ఈసీ)తన పొరపాటును సరిదిద్దుకుంది. శాసనసభకు కాదు లోక్సభకే రీపోలింగ్ అంటూ ఉత్తర్వులు జారీ చేసింది. సాలూరులో 132 పోలింగ్ బూత్‌లో రీపోలింగ్ విషయమై కలెక్టర్ పొరపాటుపడ్డారు.
లోక్‌సభ బదులు అసెంబ్లీకి రీపోలింగ్ జరపాలంటూ కలెక్టర్ ఈసీకి పొరపాటుగా నివేదిక ఇచ్చారు. అయితే ఆ తరువాత ఆయన తన పొరపాటును గుర్తించారు. ఈ విషయం ఈసీకి తెలియజేశారు. దాంతో శాసనసభ స్థానానికి కాదు లోక్సభ స్థానానికి రీపోలింగ్ అని ఈసీ తెలియజేసింది.