సాలూరు: సాలూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గం ఎన్నికలకు సంబంధించి వచ్చిన నామినేషన్లన్నీ ఆమోదయోగ్యంగా ఉన్నట్టు కోఆపరేటివ్ ఎన్నికల అధికారి పి బాంధవరావు తెలిపారు. నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని బ్యాంకు కార్యాలయంలో శనివారం నిర్వహించారు. 12మంది డెరైక్టర్ల స్థానాలకు మొత్తం 40 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిని ఎన్నికల అధికారులు పరిశీలించి అభ్యంతరాలను స్వీకరించారు.
అయితే నామినేషన్లపై ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో అన్ని నామినేషన్లు ఆమోదయోగ్యంగా ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. ఈసందర్భంగా బాంధవరావు విలేకరులతో మాట్లాడుతూ నామినేషన్ల ఉపసంహరణకు ఆదివారం సాయంత్రం 5గంటల వరకు మాత్రమే గడువు ఉందన్నారు. అనంతరం ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులతో ఈనెల 16న ప్రత్యేకగా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల తీరుతెన్నులపై సమావేశంలో అభ్యర్థులందరికీ వివరిస్తామన్నారు.
హర్షం వ్యక్తం చేసిన అభ్యర్థులు
నామినేషన్ల పరిశీలనలో అన్ని నామినేషన్లు ఆమోదం పొందడంపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ తరఫున ఎన్నికల బరిలో పోటీచేస్తున్న అభ్యర్థులు, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు జరజాపు సూరిబాబు, పార్టీ రాష్ట్ర నాయకుడు జరజాపు ఈశ్వరరావు తదితరులు బ్యాంకు కార్యాలయంలో జరిగిన నామినేషన్ల పరిశీలనకు హాజరయ్యారు. అయితే ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో అన్ని నామినేషన్లను ఆమోదిస్తున్నట్టు బ్యాంక్ సిట్టింగ్ చైర్మన్ పువ్వల నాగేశ్వరరావు సమక్షంలో ఎన్నికల అధికారి బాంధవరావు ప్రకటించారు.
ఓటింగ్‌కు 10బూత్‌లు
ఈనెల 22న జరగనున్న ఎన్నికకు 10 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయనున్నట్టు ఎన్నికల అధికారి తెలిపారు. గతంలో 8 బూత్‌లు మాత్రమే ఉండేవని, ఓటర్ల సౌలభ్యం, లెక్కింపు సులభతరం చేసేందుకు ఈసారి 10 బూత్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో పోలింగ్ జరుతుందని చెప్పారు.
నామినేషన్లన్నీ ఓకే
Published Sun, May 15 2016 1:06 AM | Last Updated on Mon, Sep 4 2017 12:06 AM
Advertisement