విద్యుదాఘాతంతో గిరిజనుడు మృతి చెందిన సంఘటన మండలంలోని తుండ పంచాయతీ జగ్గుదొరవలసలో శనివారం చోటుచేసుకుంది.
సాలూరు రూరల్ : విద్యుదాఘాతంతో గిరిజనుడు మృతి చెందిన సంఘటన మండలంలోని తుండ పంచాయతీ జగ్గుదొరవలసలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సీదరపు కాంతారావు (43) ఆయిల్ పామ్æ గెలలు కోసేందుకు ఉదయం ఎనిమిది గంటలకు పొడవాటి కత్తితో (గెలలు కోసే ఇనుప కత్తి) తోటకు వెళ్లాడు. ఈ క్రమంలో తోట సమీపంలోకి వచ్చేసరికి విద్యుత్ తీగలు కాంతారావు పట్టుకున్న కత్తికి తగలడంతో అకడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. రూరల్ ఎస్సై గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎమ్మెల్యే పరామర్శ
మృతుడి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర పరామర్శించారు. ప్రభుత్వం తరపున సాయమందేలా చూస్తానని చెప్పారు.