Tribesmen killed
-
జీలుగ కల్లు తాగిన ఐదుగురు మృతి
రాజవొమ్మంగి: జీలుగ కల్లు తాగిన ఐదుగురు గిరిజనులు మృతి చెందారు. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలోని రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన చదల సుగ్రీవ(70), బూసరి సన్యాశిరావు(65), పొత్తూరి గంగరాజు(35), వేమా లోవరాజు(28), కుడే ఏసుబాబు(23), గంగరాజు తండ్రి వెంకటేశ్వర్లు రోజూ మాదిరిగానే బుధవారం ఉదయాన్నే తమకు సమీపంలోని జీలుగ చెట్టు నుంచి కల్లు సేకరించారు. సుగ్రీవ, సన్యాశిరావు, గంగరాజు, లోవరాజు, ఏసుబాబు దానిని తాగగా.. వెంకటేశ్వర్లు కల్లు నుంచి దుర్వాసన వస్తోందని ఉమ్మేశాడు. కల్లు తాగిన ఐదుగురూ కొద్దిసేపటికే వాంతి చేసుకొని.. అపస్మారక స్థితికి చేరుకున్నారు. బాధితులను అంబులెన్స్‌లో కాకినాడకు తరలిస్తుండగా మార్గంమధ్యలో ఇద్దరు, కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు. కల్లులో కావాలని ఎవరో విషం కలిపి ఉంటారని మృతుల కుటుంబసభ్యులు ఆరోపించారు. కల్లును పరిశీలించిన రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్ అందులో క్రిమి సంహారక మందు కలిసినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిపారు. శాంపిల్స్ సేకరించి కాకినాడ ల్యాబ్‌కు పంపించినట్లు ఎస్ఈబీ సీఐ ఎ.ఆనంద్ తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అండ.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండి.. ఆదుకుంటుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్, ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి చెప్పారు. మృతుల కుటుంబాల పరిస్థితిని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వారిని తప్పకుండా ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారని వెల్లడించారు. -
విద్యుదాఘాతంతో గిరిజనుడి మృతి
సాలూరు రూరల్ : విద్యుదాఘాతంతో గిరిజనుడు మృతి చెందిన సంఘటన మండలంలోని తుండ పంచాయతీ జగ్గుదొరవలసలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సీదరపు కాంతారావు (43) ఆయిల్ పామ్æ గెలలు కోసేందుకు ఉదయం ఎనిమిది గంటలకు పొడవాటి కత్తితో (గెలలు కోసే ఇనుప కత్తి) తోటకు వెళ్లాడు. ఈ క్రమంలో తోట సమీపంలోకి వచ్చేసరికి విద్యుత్ తీగలు కాంతారావు పట్టుకున్న కత్తికి తగలడంతో అకడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. రూరల్ ఎస్సై గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే పరామర్శ మృతుడి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర పరామర్శించారు. ప్రభుత్వం తరపున సాయమందేలా చూస్తానని చెప్పారు. -
ఇంటికి వెళ్తూ గిరిజనుడి మృతి
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని తాడికొండ పంచాయతీ గిరిశిఖర తోట గ్రామానికి చెందిన తోయక గిర్పా (30) అనే గిరిజనుడు భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు చేయించుకొని ఇంటికి వెళ్తూ మార్గమధ్యలోనే మృతి చెందాడు. బుధవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి భద్రగిరి పీహెచ్సీ ఇన్చార్జి వైద్యాధికారి అనిల్‌కుమార్ అందించిన వివరాలు ఇలా ఉన్నారుు. గిర్పా జ్వరంతో బాధపడుతూ ఆర్ఎంపీ సాయంతో బుధవారం ఉదయం ఆస్పత్రికి వచ్చాడు. వస్తూనే మలేరియూ టెస్ట్ చేయించుకుని ఆ స్లైడ్‌తో సహా ఆస్పత్రికి చేరుకున్నారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది గిర్పాకు వైద్యసేవలందించి ఇంటికి పంపించివేశారు. కోర్సు పూర్తరుున తర్వాత తిరిగి రావాలని సూచించడంతో గిర్పా స్వగ్రామానికి వెళ్లేందుకు ట్రక్కర్ ఎక్కాడు. వాహనం కొత్తగూడకు చేరుకునే సరికి గిర్పా టక్కర్‌లోనే కన్నుమూశాడు. మృతుడికి భార్య డుంబమ్మ, ఇద్దరు పిల్లలున్నారు.