ఇంటికి వెళ్తూ గిరిజనుడి మృతి | Tribesmen killed in Gummalaksmipuram | Sakshi
Sakshi News home page

ఇంటికి వెళ్తూ గిరిజనుడి మృతి

Published Wed, Jun 29 2016 11:42 PM | Last Updated on Mon, Sep 4 2017 3:43 AM

Tribesmen killed in Gummalaksmipuram

గుమ్మలక్ష్మీపురం: మండలంలోని తాడికొండ పంచాయతీ గిరిశిఖర తోట గ్రామానికి చెందిన తోయక గిర్పా (30) అనే గిరిజనుడు భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు చేయించుకొని ఇంటికి వెళ్తూ మార్గమధ్యలోనే మృతి చెందాడు. బుధవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి భద్రగిరి పీహెచ్‌సీ ఇన్‌చార్జి వైద్యాధికారి అనిల్‌కుమార్ అందించిన వివరాలు ఇలా ఉన్నారుు. గిర్పా జ్వరంతో బాధపడుతూ ఆర్‌ఎంపీ సాయంతో బుధవారం ఉదయం ఆస్పత్రికి వచ్చాడు.
 
 వస్తూనే  మలేరియూ టెస్ట్ చేయించుకుని ఆ స్లైడ్‌తో సహా ఆస్పత్రికి చేరుకున్నారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది గిర్పాకు వైద్యసేవలందించి ఇంటికి పంపించివేశారు. కోర్సు పూర్తరుున తర్వాత తిరిగి రావాలని సూచించడంతో గిర్పా స్వగ్రామానికి వెళ్లేందుకు ట్రక్కర్ ఎక్కాడు. వాహనం కొత్తగూడకు చేరుకునే సరికి గిర్పా టక్కర్‌లోనే కన్నుమూశాడు. మృతుడికి భార్య డుంబమ్మ, ఇద్దరు పిల్లలున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement