నాగోబా మహాపూజ ప్రచారయాత్ర షురూ | Adilabad: Mesrams Commence Kachur Prachar Of Nagoba Jatara | Sakshi
Sakshi News home page

నాగోబా మహాపూజ ప్రచారయాత్ర షురూ

Published Tue, Dec 27 2022 2:21 AM | Last Updated on Tue, Dec 27 2022 9:17 AM

Adilabad: Mesrams Commence Kachur Prachar Of Nagoba Jatara - Sakshi

ఆదివాసీల ఆరాధ్యదైవమైన నాగోబా మహాపూజకు తొలి అడుగుపడింది. జనవరి 21న నిర్వహించనున్న మహాపూజలో భాగంలో సోమ­వారం ప్రచారయాత్ర ప్రారంభమైంది. ఉమ్మడి ఆది­లాబాద్‌ జిల్లా నుంచి తరలివచ్చిన మెస్రం వంశీయులు కేస్లాపూర్‌లోని మురాడి వద్ద సమా­వేశమయ్యారు.

ఈ సందర్భంగా ప్రచారయాత్ర, గంగాజల యాత్ర, మహాపూజ, జాతర నిర్వహ­ణపై చర్చించారు. అనంతరం పూజలు చేసి ప్రచారరథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ రాథోడ్‌ జనార్దన్, నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్, మెస్రం వంశ పెద్దలు పాల్గొన్నారు. 
–ఇంద్రవెల్లి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement