సాక్షి, హైదరాబాద్ : గిరిజన గ్రామాలకు పండుగొచ్చింది. దసరా, దీపావళి అంటే అందరికీ తెలుసు.. కానీ సిరాల్ పండుగ, భౌరాపూర్ జాతర అంటే తెలియని వారే ఎక్కువ. ఇవి గిరిజనులు జరుపుకునే పండుగలు. నాగోబా సహా ఇలాంటి వాటి గురించి అందరికీ తెలియాలని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని సంకల్పించి అమలు చేస్తోం ది. ఇందులో భాగంగా ఒక్కో పండగను ప్రభుత్వ కేలండర్‌లో జోడించిన గిరిజన సంక్షేమ శాఖ.. నిర్దేశిత తేదీల్లో ఆయా తెగలున్నచోట ఈ పండుగలను అధికారికంగా నిర్వహిస్తోంది. గిరిజనుల్లో 8 ప్రధాన తెగలున్నాయి. వీరిలో గోండ్, అంద్, కొలామ్, నాయక్‌పోడ్, ఎరుకల, చెంచు, లంబాడి, కోయ తెగలున్నాయి.
నిర్వహణకు 102.3 కోట్లు
గిరిజనుల పండుగలకు ప్రభుత్వం రూ.102.3 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇందులో రెండేళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క–సారక్క జాతరకు రూ.100 కోట్లు ఖర్చు చేస్తుండగా.. సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో, రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించేందుకు రూ.కోటి ఖర్చు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment