నాగోబా విగ్రహానికి హారతి పడుతున్న గిరిజన శాఖ కమిషనర్, నిర్మల్ కలెక్టర్
ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర మెస్రం వంశీయుల మహాపూజలతో ప్రారంభమైంది. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని సోమవారం అర్ధరాత్రి నాగోబాకు పవిత్రమైన గంగాజలంతో అభిషేకం చేసి ఘనంగా పూజలు చేశారు. మెస్రం వంశంలోని 38 మంది కొత్త కోడళ్లను భేటింగ్ చేయించారు. జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ క్రిస్టిన చొంగ్తూ నాగోబాకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చరిత్ర, జాతర నిర్వహణ, అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలు సుకున్నారు. ఆదివాసీలు జీవన స్థితిగతులపై అధ్యయనం చేసి వెలుగులు నింపిన హైమన్‌డార్ఫ్ శిష్యుడు మైకెల్ యోర్క్, మైకెల్ వాలరీ నాగోబా ఆలయంలో పూజలు నిర్వహించారు. మెస్రం వంశీయులు వారికి అతిథి మర్యాదలు చేసి శాలువాలతో సన్మానించారు. మైకెల్ యోర్క్ దంపతులు గోడవ్ వద్ద బస చేసిన మెస్రం వంశీయులను గోండి భాషలో పలకరించి సందడి చేశారు. మైకెల్‌యోర్క్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ భక్తులను ఆకట్టుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment