
సాక్షి, ఆదిలాబాద్ : టీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ఎంపీలు కాంగ్రెస్‌లో చేరతారంటూ ఇటీవల హస్తం నేతలు చేసిన వ్యాఖ్యలు మరోసారి కలకలం రేపుతున్నాయి. టీఆర్‌ఎస్ నేత, ప్రస్తుత ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ పార్టీ మారుతారని, ఆయన కాంగ్రెస్‌లో చేరతారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పందించిన ఎంపీ నగేష్ ఆ వార్తలను తీవ్రంగా ఖండించారు. తనపై ఇకముందు ఇలాంటి దుష్ప్రచారం చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరుఫున ఆదిలాబాద్ నుంచి తానే పోటీచేస్తానని నగేష్ ప్రకటించారు.
దానికోసం ఇప్పటి నుంచే బీఫాం చేతిలో పట్టుకుని తిరుగుతున్నాని ఆయన తెలిపారు. కాగా మేడ్చల్ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరి గులాబీ పార్టీకి షాకిచ్చిన విషయం తెలిసిందే. తనతోపాటు మరికొంత మంది నేతలు పార్టీని వీడుతారని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గల్లో చర్చకు దారితీశాయి.
Comments
Please login to add a commentAdd a comment