సీఎంఓ నివాసంలో 3లక్షల ఫారెన్ కరెన్సీ | cbi recovered foreign currency worth over Rs 3 Lakh from Rajender Kumar's residence: CBI | Sakshi
Sakshi News home page

సీఎంఓ నివాసంలో 3లక్షల ఫారెన్ కరెన్సీ

Published Tue, Dec 15 2015 2:43 PM | Last Updated on Sun, Sep 3 2017 2:03 PM

సీఎంఓ నివాసంలో 3లక్షల ఫారెన్ కరెన్సీ

సీఎంఓ నివాసంలో 3లక్షల ఫారెన్ కరెన్సీ

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్రకుమార్ నివాసంలో మూడు లక్షల విలువైన విదేశీ కరెన్సీతో పాటు రూ.2.4లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా దాడులపై సీబీఐ మరికాసేపట్లో మీడియా ముందుకు రానుంది. మరోవైపు దాడులను ఖండిస్తూ అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకుని, ప్రధానమంత్రికి క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

 

కాగా ఢిల్లీ సచివాలయంలోని అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంలో మంగళవారం ఉదయం సీబీఐ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. సీఎంఓలోని రాజేంద్రకుమార్ అనే అధికారి ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే కేసులో ఈ సోదాలు జరిగినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement