సీబీఐ హెడ్ క్వార్టర్స్కు రాజేంద్ర కుమార్
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్రకుమార్ను సీబీఐ హెడ్ క్వార్టర్స్కు తరలించారు. సీబీఐ అధికారులు అతడిని ప్రశ్నించనున్నారు. కాగా రాజేంద్ర కుమార్ నివాసంలో దాడులు జరిపిన సీబీఐ ...ఫారెన్ కరెన్సీతో పాటు, నగదును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే తనపై కక్షతోనే ఈ దాడులు చేయించారని, సీబీఐ దాడులకు భయపడేది లేదని అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానిస్తే...కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణలు 'రబ్బిష్' అంటూ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ కొట్టిపారేశారు. మరోవైపు ఆప్తో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా తమ రాజకీయ ఎజెండా కోసం పాకులాడుతున్నాయని, అయితే ప్రజలే ఇబ్బందులు పడుతున్నారని ఆప్ మాజీ నేత యోగేంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు.