'అందుకే నా మీద బురద చల్లుతున్నారు' | Delhi CM has attempted to focus attention on me: Arun Jaitley | Sakshi
Sakshi News home page

'అందుకే నా మీద బురద చల్లుతున్నారు'

Published Thu, Dec 17 2015 3:34 PM | Last Updated on Sun, Sep 3 2017 2:09 PM

'అందుకే నా మీద బురద చల్లుతున్నారు'

'అందుకే నా మీద బురద చల్లుతున్నారు'

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై పరుష పదజాలంతో విమర్శలు చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వైఖరిని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గర్హించారు. కేజ్రీవాల్ హిస్టిరియా వచ్చినట్టుగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అసత్యాలు, అపవాదులను ఆయన నమ్ముకుంటున్నారని తన బ్లాగ్ లో పేర్కొన్నారు.

ప్రధానిపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్ ను ఇద్దరు ముఖ్యమంత్రులు నితీశ్ కుమార్, మమతా బెనర్జీ సమర్ధించడాన్ని ఆయన తప్పుబట్టారు. కేజ్రీవాల్ కు వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నట్టు బహిరంగంగా ప్రకటించాలని వారికి సూచించారు. ప్రధానికి వ్యతిరేకంగా చేసిన సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తిని దెబ్బతీయవా అని ప్రశ్నించారు. రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం అయినా ఇలాంటి వ్యాఖ్యలు సమర్థనీయం కాదన్నారు.

సీబీఐ దర్యాప్తు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారిని కాపాడేందుకు ఢిల్లీ సీఎం తనపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం, ఆయన గదిలో సీబీఐ సోదాలు జరగలేదన్న విషయం నిర్ధారణయిందని జైట్లీ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement