Delhi Secretariat
-
ఆప్ ఓటమి.. ఢిల్లీ సచివాలయం సీజ్
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో ఆప్ ఓటమితో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సచివాలయం నుంచి ఒక్క ఫైల్ కూడా బయటకెళ్లకూడదంటూ సచివాలయ అధికారులకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. గత పదేళ్లుగా ఆప్ అవినీతిపై బీజేపీ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో కాగ్ నివేదికలు ప్రవేశపెడతామని కూడా మోదీ తెలిపారు. ఫైల్స్, రికార్డ్స్ భద్రతపరచాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు ఇచ్చారు.ఢిల్లీ అసెంబ్లీపై 27 ఏళ్ల అనంతరం కాషాయ జెండా ఎగిరింది. ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ కల హ్యాట్రిక్ కల నెరవేరలేదు. బీజేపీ పైచేయి సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. తాజా సమాచారం మేరకు 70 అసెంబ్లీ స్థానాలకు గాను 47 స్థానాల్లో బీజేపీ, 23 స్థానాల్లో ఆమ్ఆద్మీ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 47 శాతం ఓట్ షేర్ సాధించి ఆగ్ర స్థానంలో నిలిచింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మంత్రులు ఘోర ఓటమి చవిచూశారు. -
యమున విశ్వరూపం.. ముంపులో ఢిల్లీ.. జల దిగ్బంధంలో జనజీవనం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రహదారులు నదులయ్యాయి. ఇళ్లు నీట మునిగిపోయాయి. శ్మశాన వాటికలు సైతం జలమయంగా మారాయి. రోడ్లపైకి వచ్చే వీలు లేకుండాపోయింది. మొత్తంగా ఢిల్లీలో జనజీవనం స్తంభించిపోయింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో యమునా నదిలో నీటమట్టం గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఏకంగా 208.62 మీటర్లకు చేరుకుంది. దీంతో నగరంలో మరిన్ని ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ఉధృత స్థిరంగా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ప్రభుత్వ సహాయక చర్యలు ముమ్మరం చేసింది. తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుండడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదల కారణంగా వజీరాబాద్, చంద్రావాల్, ఓక్లాలోని నీటి శుద్ధి ప్లాంట్లను ప్రభుత్వం మూసివేసింది. సాధారణ పరిస్థితులు నెలకొనగానే వీటిని పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రకటించారు. సహాయక చర్యల కోసం 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవు వరద తీవ్రత దృష్ట్యా నగరంలో విద్యా సంస్థలు, అత్యవసర కార్యకలాపాలు లేని ప్రభుత్వ కార్యాలయాలకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గురువారం సెలవు ప్రకటించింది. ఆదివారం దాకా సెలవు అమల్లో ఉంటుందని పేర్కొంది. నగరంలోకి భారీ వాహనాల ప్రవేశంపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. అత్యవసర సరుకులు రవాణా చేసే వాహనాలు మినహా ఇతర వాహనాలు రాకూడదని స్పష్టం చేసింది. రోడ్లపై నీరు పొంగిపొర్లుతుండడంతో తూర్పు ఢిల్లీలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు రహదారులను అధికారులు పూర్తిగా మూసివేశారు. మరికొన్ని మార్గాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. వరదల ప్రభావం మెట్రోరైలు వ్యవస్థపైనా పడింది. ముందు జాగ్రత్త చర్యగా యమునా నదిపై ఉన్న పట్టాలపై మెట్రోరైలు వేగాన్ని గంటకు 30 కిలోమీటర్లకు పరిమితం చేశారు. యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్లోకి ప్రయాణికులను అనుమతించడంలేదు. పంజాబ్, హరియాణాల్లోనూ... చండీగఢ్: పంజాబ్, హరియాణాలనూ వర్షాలు, వరద ఇంకా వదల్లేదు. జనజీవనం సాధారణ స్థితికి చేరుకోలేదు. విద్యా సంస్థలకు సెలవులను పంజాబ్ ప్రభుత్వం ఈ నెల 16 దాకా పొడిగించింది. ఢిల్లీలో యమునా నది వరదకు కారణమైన హరియాణాలోని హత్రికుండ్ బ్యారేజీ నుంచి నీటి విడుదలను తగ్గించారు. వర్షాల వల్ల రెండు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా 21 మంది మృతిచెందారు. హిమాచల్‌లో సురక్షిత ప్రాంతాలకు పర్యాటకులు సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు, కొండ చరియలు విరిగిపడడం వల్ల ఉన్నచోటే చిక్కుకుపోయిన పర్యాటకులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గురువారం చందర్తాల్ నుంచి 256 మందిని తరలించారు. గత నాలుగు రోజుల్లో 60 వేల మంది పర్యాటకులను తరలించినట్లు అధికారులు చెప్పారు. కాసోల్, ఖీర్గంగలో 10 వేల మంది చిక్కుకుపోయారు. వారు తమ కార్లను వదిలేసి బయటకు రావడానికి ఇష్టపడడం లేదు. హిమాచల్‌లో వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 91కు చేరుకుంది. 14 మంది గల్లంతయ్యారు. కేజ్రివాల్ ఇంటి వద్దకు వరద నీరు ఢిల్లీలోని కీలక ప్రాంతాలను వరద చుట్టుముట్టింది. సెక్రెటేరియట్ ఏరియాలో ముఖ్యమంత్రితోపాటు పలువురు మంత్రుల నివాసాలు ఉన్నాయి. ఈ ప్రాంతం మొత్తం జలమయంగా మారింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నివాసం వద్దకు వరద నీరు చేరింది. కాశ్మీరీ గేట్ బస్ టెరి్మనల్ నీట మునగడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులను నిలిపివేశారు. ప్రఖ్యాత ఎర్రకోట గోడల వరకూ యమునా నది నీరు చేరుకుంది. ఇక్కడ మోకాళ్ల లోతు నీటిలో జనం నడిచి వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. రాజ్‌ఘాట్, పురానా ఖిలా సైతం జలమయమయ్యాయి. ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని సుశ్రుత ట్రామా కేర్ సెంటర్ మునిగిపోవడంతో 40 మంది రోగులను మరో ఆసుపత్రికి తరలించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, యూపీ తదితర రాష్ట్రాల్లో మరికొన్ని రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. -
కేజ్రీవాల్‌పై బూటు దాడి
‘సరి-బేసి’పై విలేకరుల భేటీలో.. కేజ్రీకి కొద్ది దూరంలో పడ్డ బూటు న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై మరోమారు దాడి జరిగింది. శనివారం ఢిల్లీ సెక్రెటేరియట్‌లో ‘సరి-బేసి’పై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓ వ్యక్తి కేజ్రీవాల్‌పై బూటు దాడి చేశాడు. అయితే బూటు కేజ్రీవాల్‌కు తాకలేదు. పక్కనే ఉన్న ఓ అధికారి వెంటనే స్పందించి కేజ్రీవాల్‌కు బూటు తాకకుండా అడ్డుకున్నారు. బూటు విసిరిన వ్యక్తిని వేద్ ప్రకాశ్‌గా పోలీసులు గుర్తించారు. ‘అరవింద్ గారు ఒక్క నిమిషం. సీఎన్జీ స్టిక్కర్ కుంభకోణంపై నేను ఒక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించాను. ఒక్కో స్టిక్కర్‌ను రూ.1,000కి పంపిణీ చేశారు. ఎందుకిలా చేస్తున్నారు. ఎందుకు చర్యలు తీసుకోరు’ అని బూటు, సీడీ విసరడానికి ముందు ప్రకాశ్ ప్రశ్నించాడు. తర్వాత తాను ఆమ్ ఆద్మీ సేనకు చెందిన వ్యక్తిగా ప్రకటించుకున్నాడు. దాడి జరిగిన వెంటనే వేద్‌ను ఆప్ కార్యకర్తలు పక్కకు తోసేశారు. పోలీసులు అతడిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. తర్వాత సమావేశాన్ని కేజ్రీవాల్ కొనసాగించారు. దీనిపై స్పందించిన ఢిల్లీ పర్యాటక మంత్రి కపిల్ శర్మ.. దాడి వెనక ఢిల్లీ బీజేపీ నేత హస్తముందని ఆరోపించారు. ప్రకాశ్ కాల్‌డేటాపై విచారణ చేపట్టాలని ట్వీట్ చేశారు. దాడిని ఖండించిన బీజేపీ.. ఇలాంటి ఘటనలు పదేపదే ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నించాలని సూచించింది. ఎక్కువ దాడులు కేజ్రీపైనే.. ► రాజకీయాల్లోకి వచ్చినప్పట్నుంచి కేజ్రీవాల్‌పై దాడులు సాగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఆయనపై దాడులు.. ► 2013 నవంబర్‌లో హజారే మద్దతుదారుడినని ప్రకటించుకున్న ఓ వ్యక్తి.. కేజ్రీవాల్, ఆప్ కార్యకర్తలపై సిరా దాడి చేశాడు. ►2014 మార్చిలో వారణాసిలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్‌పై కొందరు వ్యక్తులు గుడ్లు, సిరాతో దాడి చేశారు. ►2014 ఏప్రిల్‌లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ వీపుపై ఓ వ్యక్తి కొట్టాడు. నాలుగు రోజుల తర్వాత సుల్తాన్‌పురిలో ఓ రిక్షావాలా కేజ్రీ చెంపపై కొట్టాడు. ► గత జనవరిలో ‘సరి-బేసి’ తొలి దశ విజయోత్సవ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ సేన కార్యకర్త భావన అరోరా.. సిరా దాడి చేశారు. -
14 లిక్కర్ బాటిళ్లు.. 26 లక్షల నగదు!
న్యూఢిల్లీ: కేంద్ర సర్కార్‌కు కేజ్రీవాల్ ప్రభుత్వానికి మధ్య రాజకీయ యుద్ధానికి తెరలేపిన రాజేంద్రకుమార్ కేసులో సీబీఐ మరిన్ని అనూహ్య విషయాలు వెల్లడించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన కార్యదర్శి అయిన రాజేంద్రకుమార్ ఇంట్లో 14 మద్యం బాటిళ్లు లభించాయని తెలిపింది. అదేవిధంగా ఆయన బ్యాంకులో రూ. 28 లక్షల నగదు లభించిందని, దానిని స్వాధీనం చేసుకున్నామని సీబీఐ వివరించింది. ఢిల్లీ సెక్రటేరియట్‌లోని రాజేంద్రకుమార్ కార్యాలయంలో సీబీఐ సోదాలు జరుపడం రాజకీయ దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. తనను రాజకీయంగా ఎదుర్కొనలేకనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ చర్యకు పాల్పడ్డారని, ఆయనో పిరికిపంద, సైకో అంటూ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. ఈ కేసుతో తమకు రాజకీయంగా ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సీబీఐ కూడా సోదాలపై వివరణ ఇచ్చింది. కేజ్రీవాల్ ప్రభుత్వం రాకముందే రాజేంద్రకుమార్ అవినీతి చర్యలకు పాల్పడ్డారని, ఆయన వివిధ కంపెనీలకు టెండర్లు నిర్వహించకుండా కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా ఢిల్లీ ప్రభుత్వానికి నష్టం చేకూర్చారని, అందుకే ఆయన ఇల్లు, కార్యాలయంపై దాడులు జరిపినట్టు సీబీఐ తెలిపింది. ఆయన బ్యాంకులో 28 లక్షల నగదు దొరికిందని, అదేవిధంగా పరిమితికి మించి 14 మద్యం బాటిళ్లు ఆయన నివాసంలో లభించాయని, వీటిని స్వాధీనం చేసుకున్నామని సీబీఐ తెలిపింది. అయితే రాజేంద్రకుమార్‌కు వ్యతిరేకంగా సీబీఐ వద్ద తగినంత సాక్ష్యాధారాలు లేవని కేజ్రీవాల్ ప్రభుత్వం, ఆమ్ ఆద్మీ పార్టీ అంటున్నాయి. -
సీబీఐ హెడ్ క్వార్టర్స్‌కు రాజేంద్ర కుమార్
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్రకుమార్‌ను సీబీఐ హెడ్ క్వార్టర్స్‌కు తరలించారు. సీబీఐ అధికారులు అతడిని ప్రశ్నించనున్నారు. కాగా రాజేంద్ర కుమార్ నివాసంలో దాడులు జరిపిన సీబీఐ ...ఫారెన్ కరెన్సీతో పాటు, నగదును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తనపై కక్షతోనే ఈ దాడులు చేయించారని, సీబీఐ దాడులకు భయపడేది లేదని అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానిస్తే...కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణలు 'రబ్బిష్' అంటూ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ కొట్టిపారేశారు. మరోవైపు ఆప్‌తో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా తమ రాజకీయ ఎజెండా కోసం పాకులాడుతున్నాయని, అయితే ప్రజలే ఇబ్బందులు పడుతున్నారని ఆప్ మాజీ నేత యోగేంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. -
నా కొడుకునైనా జైలుకు పంపిస్తా: కేజ్రీవాల్
-
నా కొడుకునైనా జైలుకు పంపిస్తా: కేజ్రీవాల్
న్యూఢిల్లీ : సీబీఐ దాడులు ఆశ్చర్యాన్ని కలిగించాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వాన్ని సీబీఐ టార్గెట్ చేసిందని ఆయన ఆరోపించారు. అవినీతిని ఏమాత్రం సహించేది లేదని, అవినీతిలో ప్రమేయం ఉంటే తన కొడుకునైనా జైలుకు పంపిస్తానని కేజ్రీవాల్ అన్నారు. వాళ్లకు తానే టార్గెట్ అని, తన కార్యదర్శి రాజేంద్ర కుమార్ కాదని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సంబంధం ఉన్న డీడీసీఏ(ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్) ఫైళ్ల కోసమే సోదాలు నిర్వహించారని ఆయన విమర్శించారు. తన కార్యాలయంలోని ప్రతి ఫైల్‌ను సీబీఐ సోదాలు చేసిందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. తన చివరి శ్వాస వరకూ పోరాడుతూనే ఉంటానని ఆయన అన్నారు. కాగా సీబీఐ దాడులపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్ ను టార్గెట్ చేసే దాడులు జరిపారన్నారు. దీనిపై ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు సిద్థమేనని ఆయన సవాల్ విసిరారు. మరోవైపు కేజ్రీవాల్ కార్యాలయంలో సీబీఐ దాడులు జరపటాన్ని పశ్చిమ బెంగాల్, బిహార్ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నితీశ్ కుమార్ తప్పుబట్టారు. అలాగే అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఉన్నప్పుడు సీఎం కార్యదర్శి సహా ఎవరిపైన అయినా సీబీఐ దాడులు చేయొచ్చని, దీన్ని రాజకీయం చేయడం సరికాదని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. -
కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలి
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అరవింద్ కేజ్రీవాల్ తక్షణమే క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని పిరికిపంద, సైకో అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా సీఎంవో కార్యాలయంపై సీబీఐ దాడుల ఘటనకు సంబంధించి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. సీబీఐ దాడులకు ముఖ్యమంత్రి అనుమతి అవసరం లేదన్నారు. అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తిని కేజ్రీవాల్ సమర్థించడం సరికాదన్నారు. అవినీతి ఆరోపణలు ఉంటేనే సీబీఐ దాడులు చేస్తుందని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. కేజ్రీవాల్ కార్యాలయంలో సీబీఐ దాడులు చేయలేదని, తప్పుడు విమర్శలు చేస్తున్న కేజ్రీవాల్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని అన్నారు. మరోవైపు కేజ్రీవాల్ కార్యాలయంలో దాడులు జరిపినట్లు వచ్చిన వార్తలను సీబీఐ ఖండించింది. దాడులు జరపినట్లు వచ్చిన వార్తలు నిరాధారమైనవంటూ సీబీఐ అధికారులు కొట్టిపారేశారు. -
సీఎంఓ నివాసంలో 3లక్షల ఫారెన్ కరెన్సీ
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్రకుమార్ నివాసంలో మూడు లక్షల విలువైన విదేశీ కరెన్సీతో పాటు రూ.2.4లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా దాడులపై సీబీఐ మరికాసేపట్లో మీడియా ముందుకు రానుంది. మరోవైపు దాడులను ఖండిస్తూ అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకుని, ప్రధానమంత్రికి క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. కాగా ఢిల్లీ సచివాలయంలోని అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంలో మంగళవారం ఉదయం సీబీఐ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. సీఎంఓలోని రాజేంద్రకుమార్ అనే అధికారి ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే కేసులో ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. -
సీఎం కార్యాలయంలో సీబీఐ సోదాలు
-
సీఎం కార్యాలయంలో సీబీఐ సోదాలు
ఢిల్లీ సచివాలయంలోని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంలో మంగళవారం ఉదయం సీబీఐ సోదాలు జరిగాయి. సీఎంఓలోని రాజేంద్రకుమార్ అనే అధికారి ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే కేసులో ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. సీఎం కార్యాలయం ఉన్న ఫ్లోర్ మొత్తాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. కేంద్రం ఎన్ని రకాలుగా బెదిరించినా తాను మాత్రం భయపడేది లేదని ఆయన అన్నారు. తన కార్యాలయంలో సీబీఐ దాడులు జరిగాయని, అయితే తనను రాజకీయంగా ఎదుర్కోవడం చేతకాక.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆయన మరో ట్వీట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, తాము కేజ్రీవాల్ కార్యాలయంలో ఎలాంటి సోదాలు చేయలేదని సీబీఐ వర్గాలు అంటున్నాయి. కేవలం సెక్రటరీ రాజేంద్రకుమార్ కార్యాలయంలో మాత్రమే సోదాలు చేస్తున్నట్లు వివరించాయి. సీఎంఓలోని ముఖ్యకార్యదర్శి రాజేంద్రకుమార్ మీద, మరికొందరు ప్రైవేటు వ్యక్తుల మీద 'నేరపూరిత దుష్ప్రవర్తన'కు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. ఢిల్లీ ప్రభుత్వంలోని కొందరు అధికారులు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారు. చాలా కాలంగా వాళ్లకు రాజేంద్ర కుమార్ సాయం చేస్తూ, కాంట్రాక్టులు ఇప్పిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రాజేంద్రకుమార్ కార్యాలయంతో పాటు మరో నాలుగు ప్రాంతాల్లో కూడా మంగళవారం ఉదయం సీబీఐ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఈ సోదాలను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ''దేశంలో తొలిసారి ఒక ముఖ్యమంత్రి కార్యాలయంలో సీబీఐ సోదాలు జరిగాయి. ప్రధానమంత్రి ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు సృష్టిస్తున్నారు. ప్రధాని సూచనల మేరకే సీబీఐ పనిచేస్తోందని అందరికీ తెలుసు. సోదాలు చేయడానికి ముందు అసలు ముఖ్యమంత్రికి విషయం చెప్పారా" అని పార్టీ ప్రతినిధి ప్రశ్నించారు. CBI raids my office — Arvind Kejriwal (@ArvindKejriwal) December 15, 2015 When Modi cudn't handle me politically, he resorts to this cowardice — Arvind Kejriwal (@ArvindKejriwal) December 15, 2015 -
జనతా దర్బార్ రసాభాస
కేజ్రీవాల్‌కు సమస్యలు చెప్పుకునేందుకు వెల్లువెత్తిన జనం సాక్షి, న్యూఢిల్లీ: ప్రజల సమస్యలను స్వయం వారి నుంచి తెలుసుకునేందుకంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ఢిల్లీ సచివాలయం వద్ద నిర్వహిం చిన మొట్టమొదటి జనతా దర్బార్‌కు జనం వెల్లువెత్తటంతో రసాభాసగా మారింది. వేలాది మంది ఒక్కసారిగా తరలిరావటంతో ప్రభుత్వం చేసిన ఏరా ట్లు, నియంత్రణ చర్యలు ఏమాత్రం సరిపోలేదు. జనం బారికేడ్లను కూలదోసి ముందుకురావటం, సీఎంను కలవటానికి పోటీపడటంతో పెద్ద ఎత్తున తోపులాట చోటుచేసుకుంది. తీవ్ర గందరగోళం తలెత్తటంతో కేజ్రీవాల్ అర్ధంతరంగా జనతాదర్బార్‌ను నిలిపివేశారు. పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసిన అనంతరం మరో వారం రోజుల్లోపలే మళ్లీ జనతాదర్బార్‌ను నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. అర కిలోమీటరు వరకూ జనం.. ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం.. ఢిల్లీ సచివాలయం ఎదుట రోడ్డుపై ఉదయం తొమ్మిదిన్నర నుంచి 11 గంటల వరకు జనతా దర్బార్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. వెయ్యి మంది ఢిల్లీ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసింది. సమస్యలు తెలిపేందుకు వచ్చే ప్రజల కోసం వెయ్యి కుర్చీలు కూడా వేశారు. అయితే తమ సమస్యలను మొరపెట్టుకోవడానికి నగరం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో జనం వచ్చారు. అర కిలోమీటరు కన్నా పొడవు క్యూలో జనం నిలబడ్డారు. మంత్రివర్గ సహచరులతో కలిసి కేజ్రీవాల్ జనతాదర్బార్‌కు రాగానే.. ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి తమ సమస్య వినిపించాలన్న ఆత్రుతతో జనం మధ్య తోపులాట మొదలై పరిస్థితి అదుపుతప్పింది. జనం బారికేడ్లను కూలదోసి మరీ ముందుకు తోసుకెళ్లారు. పోలీసులతో పాటు, సాయంగా ఆప్ కార్యకర్తలు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ప్రజలను నియంత్రించలేకపోయారు. ప్రజల సహాయం కోసం ఏర్పాటుచేసిన హెల్ప్డెస్క్లూ పనికిరాకుండా పోయాయి. ఈ గందరగోళం మధ్య కేజ్రీవాల్ కూడా బారికేడ్ పెకైక్కి ప్రజలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ పరిస్థితి అదుపులోకి రాకపోవటంతో పాటు.. కేజ్రీవాల్ మధ్యలోనే జనతా దర్బార్ నుంచి పోలీసుల సాయంతో సచివాలయంలోకి వెళ్లిపోయారు. పాఠం నేర్చుకున్నాం...కేజ్రీవాల్ కాసేపటికి సచివాలయంలోని ఒక భవనం పెకైక్కి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇంతమంది వస్తారని తాము అనుకోలేదని, సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్ల జనతా దర్బార్‌ను కొనసాగించ లేకపోతున్నామని చెప్పారు. జనం తిరిగి ఇళ్లకు వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు. సోమ, మంగళవారాలు జనతా దర్బార్ జరగవన్నారు. వారం రోజుల లోపల మెరుగైన ఏర్పాట్లతో మళ్లీ జనతా దర్బార్ నిర్వహిస్తామని చెప్పారు. కేజ్రీవాల్ ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలు అదుపుతప్పటంతో తాను జనతా దర్బార్ నుంచి బయటకు వచ్చేశానని.. లేనట్లయితే తొక్కిసలాట జరిగేదని పేర్కొన్నారు. నిర్వహణా లోపం వల్ల పరిస్థితి గందరగోళంగా తయారైనప్పటికీ పాఠం నేర్చుకున్నామన్నారు. ఇందుకు ప్రజలకు క్షమాపణ చెప్తూ.. ఈసారి మెరుగైన ఏర్పాట్లతో పెద్ద వేదిక వద్ద దర్బార్‌ను నిర్వహిస్తామన్నారు. దర్బార్‌ను అర్థంతరంగా నిలిపివేయటంతో.. నేరుగా సీఎంను కలుసుకుని తమ సమస్యలను విన్నవించుకోవాలని ఆశలతో వచ్చిన వేలాది మంది జనం నిరుత్సాహంతో వెనుదిరిగారు. కొందరు తమ సమస్యలు వినిపించే అవకాశం లభించకపోవడంతో ఆగ్రహానికి గురయ్యారు. మరి కొందరు నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. మంత్రులు సౌరభ్‌భరద్వాజ్, సోమ్‌నాథ్‌భారతి, రాఖీబిర్లా అక్కడే ఉండి ప్రజల సమస్యలను విన్నారు. వారి నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. చాలా మంది తమ సమస్యలను వినిపించకుండానే వెనుదిరిగారు. వినతిపత్రాలు చిందరవందరగా పడిపోయి కనిపించాయి. -
కొత్త ప్రభుత్వాన్ని స్వాగతించడానికి ఢిల్లీ సచివాలయం సన్నద్ధం
న్యూఢిల్లీ: కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్‌పార్టీ ప్రభుత్వానికి ఢిల్లీ సచివాలయం స్వాగతించడానికి సన్నద్ధమవుతోంది. పూర్వ ప్రభుత్వం కాంగ్రెస్ మంత్రుల పేర్లను తుడిపించి, గదులను శుభ్రం చేయిస్తున్నారు. సెలవుల్లో ఉన్న సిబ్బందిని ఆఘామేఘాల మీద రప్పించి విధుల్లో చేర్పిస్తున్నారు. కొత్త ప్రభుత్వం రాంలీలా మైదాన్‌లో పదవీ ప్రమాణ స్వీకారాలు చేయనున్నట్లు ఆప్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు కేజ్రీవాల్ సంసిద్ధతను వ్యక్తం చేసిన వెంటనే పాత ప్రభుత్వంలో పదవీ బాధ్యతలు నిర్వహించిన నలుగురు మంత్రుల గదుల మీద నేమ్ ప్లేట్లను తొలిగించారు. మంగళవారం మధ్యాహ్నం పాలన విభాగం తక్కిన మంత్రుల గదుల నేమ్ ప్లేట్లను కూడా తొలిగించాలని ఆదేశాలు జారీ చేసింది. 15 సంవత్సరాలు పరిపాలన నిర్వహించిన కాంగ్రెస్ నాయకురాలు ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కాపాలదారులను మార్చడానికి అధికారులు కొంత తత్తరపడినట్లు కనిపించారు. ఉరుకలెత్తుతున్న యువరక్తం అధికారంలోకి రావడాన్ని తాము స్వాగతిస్తున్నామని కొందరు అధికారులు తెలిపారు. ‘‘బహుశ మేమంతా ఓ ప్రత్యేక తరహాలో పనిచేయాల్సి వస్తుందని విశ్వసిస్తున్నారు. ఈ మార్పు సానుకూలంగానే ఉంటుందని భావిస్తున్నాం. మేము పనిచేయడానికి సిద్ధమయ్యే ఉన్నాం. ఆందోళన పడాల్సింది ఏ మాత్రం లేదు’’ అని వారి మనుసులో మాటలను పంచుకున్నారు. కొత్త ప్రభుత్వ అధినేత కేజ్రీవాల్ ఇప్పటికే వివిధ శాఖ వ్యవహారాలను చూస్తున్న అధికారుల వివరాలను సేకరించినట్లు వినికిడి. వారి వారి పనివిధానం, పదవీ కాలంలో సాధించిన ఫలితాలను బేరీజు వేసినట్లు భావిస్తున్నారు. వివాదాలు, కుంభకోణాల్లో భాగస్వాములుగా విమర్శలు ఎదుర్కొన్న వారి పేర్ల జాబితాను కూడా సిద్ధం చేసి ఉంచుకున్నట్లు తెలిసింది. -
లైంగిక వేధింపులకు బలైన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ఉద్యోగిని!
ఓ కళాశాల ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో గత ఏడు రోజుల క్రితం ఒంటిపై కిరొసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన డిల్లీ యూనివర్సిటీలో పనిచేసిన లాబ్ అసిస్టెంట్ పవిత్ర భరద్వాజ్ సోమవారం ఉదయం మరణించారు. గత ఏడు రోజుల క్రితం ఢిల్లీ సచివాలయం గేట్ నంబర్ 6 వద్ద కిరోసిన్ పోసుకుని ఒంటికి నిప్పంటించుకోవడంతో పవిత్రను ఎల్ఎన్ జేపీ ఆస్పత్రికి తరలించారు. 90 శాతం గాయాలైన పవిత్ర చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుదిశ్వాస వదిలారు. యమునా విహార్ లోని బీమ్ రావ్ అంబేద్కర్ కాలేజి ప్రిన్స్ పాల్ జీకే అరోరా, మరో ఉద్యోగి శారీరకంగా, మానసికంగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తన సూసైట్ నోట్ లో వెల్లడించింది. పోలీసులు సంఘటనా స్థలం నుంచి సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. పవిత్ర మృతి సమాచారం తెలుసుకున్న కళాశాల విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేసు విచారణ పూర్తయ్యేంత వరకు ప్రిన్స్ పాల్ ను విధులనుంచి తొలగించాలని విద్యార్థులు, ఉద్యోగులు డిమాండ్ చేశారు. సూసైడ్ నోట్ లో స్పష్టంగా నిందితుల పేర్లు ఉన్నప్పటికి.. ఢిల్లీ పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోవడంలేదని విద్యార్థులు ఆరోపణలు చేశారు. రెండేళ్ల క్రితం బాధితురాలిని విధుల నుంచి యూనివర్సిటీ యాజమాన్యం తొలగించగా.. పోలీసులు ఆమెపై ఆత్మహత్య కేసును నమోదు చేశారు. ఆరోరాపై బాధితురాలు ఫిర్యాదు చేసినా.. ప్రిన్స్ పాల్ కు యూనివర్సిటి మేనేజ్ మెంట్ క్లీన్ చిట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.