లైంగిక వేధింపులకు బలైన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ఉద్యోగిని!
Published Mon, Oct 7 2013 2:30 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
ఓ కళాశాల ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో గత ఏడు రోజుల క్రితం ఒంటిపై కిరొసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన డిల్లీ యూనివర్సిటీలో పనిచేసిన లాబ్ అసిస్టెంట్ పవిత్ర భరద్వాజ్ సోమవారం ఉదయం మరణించారు.
గత ఏడు రోజుల క్రితం ఢిల్లీ సచివాలయం గేట్ నంబర్ 6 వద్ద కిరోసిన్ పోసుకుని ఒంటికి నిప్పంటించుకోవడంతో పవిత్రను ఎల్ఎన్ జేపీ ఆస్పత్రికి తరలించారు. 90 శాతం గాయాలైన పవిత్ర చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుదిశ్వాస వదిలారు.
యమునా విహార్ లోని బీమ్ రావ్ అంబేద్కర్ కాలేజి ప్రిన్స్ పాల్ జీకే అరోరా, మరో ఉద్యోగి శారీరకంగా, మానసికంగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తన సూసైట్ నోట్ లో వెల్లడించింది. పోలీసులు సంఘటనా స్థలం నుంచి సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. పవిత్ర మృతి సమాచారం తెలుసుకున్న కళాశాల విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేసు విచారణ పూర్తయ్యేంత వరకు ప్రిన్స్ పాల్ ను విధులనుంచి తొలగించాలని విద్యార్థులు, ఉద్యోగులు డిమాండ్ చేశారు.
సూసైడ్ నోట్ లో స్పష్టంగా నిందితుల పేర్లు ఉన్నప్పటికి.. ఢిల్లీ పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోవడంలేదని విద్యార్థులు ఆరోపణలు చేశారు. రెండేళ్ల క్రితం బాధితురాలిని విధుల నుంచి యూనివర్సిటీ యాజమాన్యం తొలగించగా.. పోలీసులు ఆమెపై ఆత్మహత్య కేసును నమోదు చేశారు. ఆరోరాపై బాధితురాలు ఫిర్యాదు చేసినా.. ప్రిన్స్ పాల్ కు యూనివర్సిటి మేనేజ్ మెంట్ క్లీన్ చిట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement