మహిళ ఉద్యోగిని లైంగికంగా వేధించి, ఆమె ఆత్మహత్యకు కారణమైన ప్రిన్సిపాల్పై కేసు నమోదు చేశారు. ఢిల్లీలోని భీమ్ రావు అంబేద్కర్ కాలేజీ ప్రిన్సిపాల్ జి.కె.అరోరా.. అదే కాలేజీలో పనిచేసే పవిత్ర భరద్వాజ్ (35)ను వేధించేవాడు. విసిగిపోయిన పవిత్ర గత నెల 30న ఢిల్లీ సెక్రటేరియట్ ఎదుట ఆత్మహత్యకు పాల్పడింది. నిప్పంటించుకున్న పవిత్ర వారం రోజుల పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఈ నెల 7న కన్నుమూసింది. అరోరాతో పాటు మరికొందరు ఉద్యోగులు తనను లైంగికంగా, మానసికంగా వేధించారని, వారి ఆగడాలను భరించలేకే ఆత్మహత్యకు పాల్పడినట్టు వాంగ్మూలమిచ్చింది.
ఈ సంఘటనపై ఢిల్లీ ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. 11న ఢిల్లీ యూనివర్సిటీ అరోరాను విచారణ ముగిసే వరకు సస్పెండ్ చేసింది. ఈ కేసు విచారణ చేస్తున్నట్టు ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ చెప్పారు.
లైంగికంగా వేధించి.. ఆత్మహత్యకు కారణమైన ప్రిన్సిపాల్పై కేసు
Published Thu, Oct 17 2013 12:06 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
Advertisement