Principal suspend
-
పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్‌పై వేటు
చిత్తూరు ,పలమనేరు: పట్టణ సమీపంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ విశ్వనాథరెడ్డిపై ఎట్టకేలకు వేటుపడింది. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అధ్యాపకుడు శ్రీధర్‌ను సైతం సస్పెండ్ చేశారు. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ మూడు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీధర్ అనే అధ్యాపకుడు సెప్టంబరు 26న విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడంతో వారు తరగతులను బహిష్కరించిన విషయం తెలిసిందే. దీనిపై సాంకేతిక విద్యాశాఖ ఆర్జేడీ సూర్యుడు విచారణ చేపట్టారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ అక్కడి మహిళా అధ్యాపకులను వేధిస్తున్నారనే విషయాలు వెలుగుచూశాయి. ఆర్జేడీ నివేదికను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌కు పంపారు. దీంతో ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకుడిని సస్పెండ్ చేస్తూ ఆ శాఖ కమిషనర్ పండాదాస్ మూడు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్చార్జ్ ప్రిన్సిపాల్‌గా మహ్మద్ కళాశాలకు ఇన్చార్జ్ ప్రిన్సిపాల్‌గా సివిల్ ఇంజినీరింగ్ హెచ్వోడీగా పనిచేస్తున్న మహ్మద్‌ను నియమించారు. ఆయన శనివారం చార్జ్ తీసుకున్నారు. ఇప్పటికే కళాశాల హాస్టల్ మెస్ విషయంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కళాశాలలో గ్రూపు రాజకీయాలు సాగుతున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కళాశాల పాలన పూర్తిగా గాడితప్పింది. కొందరు అధ్యాపకులు సమయపాలన పాటించడం లేదు. కొత్తగా బాధ్యతలు తీసుకున్న ప్రిన్సిపాల్ ఈ సమస్యలను ఏవిధంగా పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందే. -
లైంగికంగా వేధించి.. ఆత్మహత్యకు కారణమైన ప్రిన్సిపాల్‌పై కేసు
మహిళ ఉద్యోగిని లైంగికంగా వేధించి, ఆమె ఆత్మహత్యకు కారణమైన ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేశారు. ఢిల్లీలోని భీమ్ రావు అంబేద్కర్ కాలేజీ ప్రిన్సిపాల్ జి.కె.అరోరా.. అదే కాలేజీలో పనిచేసే పవిత్ర భరద్వాజ్ (35)ను వేధించేవాడు. విసిగిపోయిన పవిత్ర గత నెల 30న ఢిల్లీ సెక్రటేరియట్ ఎదుట ఆత్మహత్యకు పాల్పడింది. నిప్పంటించుకున్న పవిత్ర వారం రోజుల పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఈ నెల 7న కన్నుమూసింది. అరోరాతో పాటు మరికొందరు ఉద్యోగులు తనను లైంగికంగా, మానసికంగా వేధించారని, వారి ఆగడాలను భరించలేకే ఆత్మహత్యకు పాల్పడినట్టు వాంగ్మూలమిచ్చింది. ఈ సంఘటనపై ఢిల్లీ ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. 11న ఢిల్లీ యూనివర్సిటీ అరోరాను విచారణ ముగిసే వరకు సస్పెండ్ చేసింది. ఈ కేసు విచారణ చేస్తున్నట్టు ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ చెప్పారు.