
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో ఆప్ ఓటమితో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సచివాలయం నుంచి ఒక్క ఫైల్ కూడా బయటకెళ్లకూడదంటూ సచివాలయ అధికారులకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. గత పదేళ్లుగా ఆప్ అవినీతిపై బీజేపీ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో కాగ్ నివేదికలు ప్రవేశపెడతామని కూడా మోదీ తెలిపారు. ఫైల్స్, రికార్డ్స్ భద్రతపరచాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు ఇచ్చారు.
ఢిల్లీ అసెంబ్లీపై 27 ఏళ్ల అనంతరం కాషాయ జెండా ఎగిరింది. ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ కల హ్యాట్రిక్ కల నెరవేరలేదు. బీజేపీ పైచేయి సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. తాజా సమాచారం మేరకు 70 అసెంబ్లీ స్థానాలకు గాను 47 స్థానాల్లో బీజేపీ, 23 స్థానాల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 47 శాతం ఓట్ షేర్ సాధించి ఆగ్ర స్థానంలో నిలిచింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మంత్రులు ఘోర ఓటమి చవిచూశారు.
Comments
Please login to add a commentAdd a comment