సాక్షి, విజయవాడ: విదేశీ కరెన్సీని మార్పిడి చేసే యూఏఈ ఎక్స్ఛేంజి సంస్థ రీజినల్ కార్యాలయం విజయవాడలో ప్రారంభమయ్యింది. మంగళవారం సూర్యారావుపేట వేమూరివారి వీధిలో కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆ సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ వి.జార్జి అంటోనీ విలేకరులతో మాట్లాడతూ నూతన రాష్ట్రంలోని 13 జిల్లాలకు కలిపి ఈ రీజినల్ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమైక్యాంధ్రప్రదేశ్‌లో తమ కంపెనీకి 57 బ్రాంచీలు ఉన్నాయని తెలిపారు.
రిజర్వు బ్యాంకు గుర్తించిన దేశాలకు చెందిన కరెన్సీని తమ సంస్థలో మార్చుకోవచ్చన్నారు. విదేశాలకు వెళ్లేవారికి అక్కడి కరెన్సీని ఇక్కడే తీసుకునే సౌకర్యం ఉందన్నారు. విదేశాలకు డబ్బు పంపే సౌకర్యం, విదేశీ కరెన్సీ డిమాండ్ డ్రాప్టులు వంటి సేవలు తమ సంస్థ అందిస్తోదన్నారు.
విజయవాడలో యూఏఈ ఎక్స్చేంజ్ ప్రాంతీయ కార్యాలయం
Published Wed, Jun 10 2015 1:09 AM | Last Updated on Sun, Sep 3 2017 3:28 AM
Advertisement