Regional Office
-
జనం నిర్లక్ష్యం
-
ఆ కార్యాలయం ఇకపై విశాఖలో..!
సాక్షి, అమరావతి: విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా నిర్ణయించాక.. ఆ దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. విశాఖలో 79.91 కిలోమీటర్లు మేర లైట్ మెట్రోరైలు కారిడార్ ను 60 కిలోమీటర్ల మేర ట్రామ్ కారిడార్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు ఏర్పాటు చేసింది. డీపీఆర్‌ల రూపకల్పనకు కొటేషన్లు పిలిచింది. ప్రతిపాదిత 79.91 కిలోమీటర్ల విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు 60 కిలోమీటర్ల మేర లైట్ మెట్రో రైలు ప్రాజెక్టు పనులన్నీ ఇక ఈ ప్రాంతీయ కార్యాలయం నుంచే కొనసాగనున్నాయి. చదవండి: ఏపీ కేబినెట్: కీలక నిర్ణయాలకు ఆమోదం -
నిజామాబాద్‌లో స్పైసెస్ బోర్డు రీజినల్ ఆఫీస్
సాక్షి, న్యూఢిల్లీ: నిజామాబాద్‌లో సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయం, ఎక్స్టెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. మంగళవారం ఆయన ఈ అంశంపై పార్లమెంట్ భవనంలో మీడియాతో మాట్లాడారు. ‘నిజామాబాద్ ఎంపీ అభ్యర్థన మేరకు ఆ పట్టణంలో స్పైసెస్ బోర్డు డివిజనల్ ఆఫీస్‌ను అప్‌గ్రేడ్ చేసి రీజినల్ ఆఫీస్ కమ్ ఎక్స్టెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నాం. నిజామాబాద్‌లో పలు రకాల సుగంధ ద్రవ్యాలు పండుతాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మా కార్యక్రమాలను బలోపేతం చేసేందుకు వీలుగా ఈ సెంటర్ పనిచేస్తుంది. డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి దీనికి నేతృత్వం వహిస్తారు. రెండేళ్లలో ఈ ప్రాంతం నుంచి ఎగుమతులు, ఉత్పత్తులు, నాణ్యత గణనీయంగా పెరుగుతుందని ఆశిస్తున్నాం. పసుపు, మిర్చిపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా ఈ ప్రాంతం స్పైసెస్ హబ్‌గా మారుతుంది. టీఐఈఎస్, ఏఈపీ స్కీమ్‌ల ద్వారా మౌలిక వసతులు మెరుగుపరుస్తాం. తెలంగాణలో సుగంధ ద్రవ్యాల పంటల ప్రగతికి ఈ నిర్ణయం దోహదపడుతుంది. కేంద్ర వ్యవసాయ శాఖ, కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ, వినియోగదారుల వ్యవహారాల శాఖ, వాణిజ్య శాఖల మధ్య ప్రభావవంతమైన సమన్వయం ఏర్పడుతుంది. గతంలో పసుపు బోర్డు గురించి మాట్లాడేవారు. అది చాలా చిన్నది. ఇన్ని అధికారాలు దక్కేవి కాదు. ఇంత సమన్వయం, మంత్రిత్వ శాఖల మద్దతు ఉండేది కాదు. అందుకే ఈ సెంటర్ తెచ్చాం. ఇది రైతుల ఆదాయం రెట్టింపయ్యేందుకు దోహదపడుతుంది. బోర్డుకు ఉండే అన్ని అధికారాలు దీనికి ఉంటాయి. ఈ ప్రాంతంలో టర్మరిక్ క్లస్టర్లు ఉన్నాయి. వాటికి ఈ సెంటర్ అండగా ఉంటుంది’అని వివరించారు. పంటకు ఎక్కువ ధరే లక్ష్యం... నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ... ‘స్పైసెస్ బోర్డు రీజినల్ సెంటర్ కమ్ ఎక్స్టెన్షన్ సెంటర్ ప్రకటన హర్షణీయం. టైస్ స్కీమ్ కింద ఎగుమతుల వృద్ధి, మౌలిక వసతులు పెంచడానికి, క్లస్టర్ స్కీమ్ కింద విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. పసుపు బోర్డు కోసం నిజామాబాద్ రైతులు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ బోర్డు వాణిజ్య శాఖకు మాత్రమే పరిమితమవుతుంది. వివిధ శాఖలతో సమన్వయం చేసే అధికారాలు ఉండవు. రైతుల ఆదాయం రెట్టింపయ్యేందుకు మోదీ ప్రభుత్వం తెచ్చిన పథకాలేటైస్, క్లస్టర్. పసుపు ఎగుమతులకు అవకాశం పెరగడంతో డిమాండ్ అధికం అవుతుంది. దీంతో రానున్న రోజుల్లో ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉంటుంది. అంతిమంగా రైతుకు పంట మీద ధర ఎక్కువ రావాలన్నదే మన లక్ష్యం. రైతులు డిమాండ్ చేసిన దాని కంటే కేంద్రం ఎక్కువే ఇచ్చింది’అని పేర్కొన్నారు. రైతులు.. పసుపు బోర్డు అడిగితే సుగంద ద్రవ్యాల బోర్డు ఇవ్వడాన్ని ఎలా చూడాలని మీడియా ప్రశ్నించగా.. ‘అంబాసిడర్ కారు కావాలా, మెర్సిడెస్ బెంజి కారు కావాలా? అని ఆలోచించి బెంజి కారు ఇచ్చింది. పసుపు బోర్డు డిమాండ్ చాలా కాలంనాటిది. అది ఇప్పుడు ఇచ్చినా ప్రభావవంతంగా ఉండదు’అని పేర్కొన్నారు. నోటిఫికేషన్ విడుదల... నిజామాబాద్‌లోని స్పైసెస్ బోర్డు డివిజనల్ ఆఫీస్‌ను రీజినల్ ఆఫీస్ కమ్ ఎక్స్టెన్షన్ సెంటర్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంగళవారం సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఆ శాఖ అదనపు డైరెక్టర్ ఆర్.పి.కంచన్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ సెంటర్‌కు డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారని, ఎగుమతుల వృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తారని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్పత్తులు, సంబంధిత అంశాలను సమన్వయం చేస్తారన్నారు. అలాగే సుగంధ ద్రవ్యాల బోర్డు డైరెక్టర్(మార్కెటింగ్) రెండేళ్లపాటు ఈ ప్రాంతీయ కార్యాలయం కార్యక్రమాలను ప్రతి నెలా పర్యవేక్షిస్తారని అన్నారు. దానిపై మంత్రిత్వ శాఖకు నివేదిక ఇస్తారని వివరించారు. రైతులను మభ్య పెడుతున్నారు.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పసుపు రైతులను మభ్యపెడుతూ మరోసారి మోసం చేయడానికి ఎత్తుగడ వేస్తోందని పసుపు రైతుల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు ఆరోపించారు. నిజామాబాద్ కేంద్రంగా మసాల దినుసులు, సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ బోర్డు ఏర్పాటుపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేసిన ప్రకటనపై మంగళవారం జిల్లాలోని ఆర్మూర్‌లో కమిటీ ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు. -
ఆర్ఎం కార్యాలయం ఎదుట ధర్నా
ఒంగోలు : ఆర్టీసీ రీజినల్ కార్యాలయం ఎదుట రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిప్రసాదరావు మాట్లాడుతూ 2013 ఏప్రిల్ ఒకటి నుంచి తాజాగా రిటైరైన ఆర్టీసీ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయీలు రూ.100 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. రిటైరై నలభై నెలలు దాటినా బకాయిలు అందుకోలేక జీవనోపాధికి సైతం రిటైర్డ్ కార్మికులు దినదినగండంగా గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ నుంచి అందాల్సిన ప్రయోజనాలు అందక, మరోవైపు వృద్ధాప్యంలో అవి అందుకోకుండా పలువురు మరణించారన్నారు. ఈ నేపథ్యంలో వృద్ధుల పట్ల కనికరం చూపుతూ తక్షణమే రూ.100 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా 3 ఏళ్లుగా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ కూడా నిలిచిపోయిందని, దీని వల్ల ప్రతి ఉద్యోగికి ఇప్పటి వరకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు బకాయీలు పేరుకుపోయాయన్నారు. ఆర్టీసీ ఆస్పత్రుల్లో కూడా అవసరమైన మందులు ఉండడం లేదని, ప్రైవేటు ఏజెన్సీకి ఇచ్చినా మందులు అందుబాటులో ఉంచకపోవడం దారుణమన్నారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించని పక్షంలో అక్టోబర్ 5వ తేదీన విజయవాడలోని ఆర్టీసీ ఎండీ కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఛలో విజయవాడ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు తరలి రావాలని హరిప్రసాదరావు హెచ్చరించారు. ధర్నాలో రీజనల్ అధ్యక్ష, కార్యదర్శులు కోటా నాగేశ్వరరావు, ఎస్.పోలేరయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.ఇన్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీకే మూర్తి పాల్గొన్నారు. -
30న స్పైసెస్ ఎక్స్టెన్షన్ ట్రైనీస్ ఎంపిక పరీక్ష
బాలసముద్రం : స్పైసెస్ బోర్డు–వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కార్యాలయం నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో పనిచేసేందు కు స్పైసెస్ ఎక్స్టెన్షన్ ట్రైనీస్ కోసం ఇంటర్వూ్యను ఈనెల 30న నిర్వహించనున్నట్లు బోర్డ్ డిప్యూటీ డైరెక్టర్ పురుషోత్తం తెలిపారు. ఈ పోస్టులు ఎస్సీ అభ్యర్థుల కోసం రిజర్వ్ చేశార ని, వివరాల కోసం వెబ్సైట్లో లేదా హన్మకొండ అడ్వకేట్స్‌కాలనీ రోడ్డునంబర్ 4లోని ప్రాంతీయ కార్యాల యంలో సంప్రదించాలని కోరారు. -
నిజామాబాద్‌లో పాస్‌పోర్ట్ మేళా
హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం ఆధ్వర్యంలో నిజామాబాద్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో ఈ నెల 5న పాస్‌పోర్ట్ మేళాను నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పాస్‌పోర్ట్ కావాల్సిన అభ్యర్థులు బుధవారం నుంచి ఆన్లైన్లో www. passportindia.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మొదటిసారిగా పాస్‌పోర్ట్‌కు దరఖస్తు చేసుకునేవారి, పునరుద్ధరణ కావాల్సినవారి సాధారణ అప్లికేషన్లను మాత్రమే మేళాలో పరిశీలిస్తామని, ఆన్హోల్డ్, వాకిన్, పీసీసీ, తత్కాల్ అప్లికేషన్లను పరిశీలించబోమని అధికారులు వెల్లడించారు. -
ఏపీలో యూఏఈ ఎక్స్చేంజ్ ప్రాంతీయ కార్యాలయం
విదేశీ కరెన్సీని మార్పిడి చేసే యూఏఈ ఎక్స్చేంజ్ సంస్థ రీజినల్ కార్యాలయం విజయవాడలో ప్రారంభమయ్యింది. సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ వి.జార్జి ఆంటోనీ మాట్లాడుతూ నూతన రాష్ట్రంలోని 13 జిల్లాలకు కలిపి ఈ రీజినల్ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమైక్యాంధ్రప్రదేశ్‌లో తమ కంపెనీకి 57 బ్రాంచీలు ఉన్నాయని తెలిపారు. -
విజయవాడలో యూఏఈ ఎక్స్చేంజ్ ప్రాంతీయ కార్యాలయం
సాక్షి, విజయవాడ: విదేశీ కరెన్సీని మార్పిడి చేసే యూఏఈ ఎక్స్ఛేంజి సంస్థ రీజినల్ కార్యాలయం విజయవాడలో ప్రారంభమయ్యింది. మంగళవారం సూర్యారావుపేట వేమూరివారి వీధిలో కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆ సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ వి.జార్జి అంటోనీ విలేకరులతో మాట్లాడతూ నూతన రాష్ట్రంలోని 13 జిల్లాలకు కలిపి ఈ రీజినల్ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమైక్యాంధ్రప్రదేశ్‌లో తమ కంపెనీకి 57 బ్రాంచీలు ఉన్నాయని తెలిపారు. రిజర్వు బ్యాంకు గుర్తించిన దేశాలకు చెందిన కరెన్సీని తమ సంస్థలో మార్చుకోవచ్చన్నారు. విదేశాలకు వెళ్లేవారికి అక్కడి కరెన్సీని ఇక్కడే తీసుకునే సౌకర్యం ఉందన్నారు. విదేశాలకు డబ్బు పంపే సౌకర్యం, విదేశీ కరెన్సీ డిమాండ్ డ్రాప్టులు వంటి సేవలు తమ సంస్థ అందిస్తోదన్నారు.