హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ఆధ్వర్యంలో నిజామాబాద్ పాస్పోర్ట్ సేవా కేంద్రంలో ఈ నెల 5న పాస్పోర్ట్ మేళాను నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ఆధ్వర్యంలో నిజామాబాద్ పాస్పోర్ట్ సేవా కేంద్రంలో ఈ నెల 5న పాస్పోర్ట్ మేళాను నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పాస్పోర్ట్ కావాల్సిన అభ్యర్థులు బుధవారం నుంచి ఆన్లైన్లో www. passportindia.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మొదటిసారిగా పాస్పోర్ట్కు దరఖస్తు చేసుకునేవారి, పునరుద్ధరణ కావాల్సినవారి సాధారణ అప్లికేషన్లను మాత్రమే మేళాలో పరిశీలిస్తామని, ఆన్హోల్డ్, వాకిన్, పీసీసీ, తత్కాల్ అప్లికేషన్లను పరిశీలించబోమని అధికారులు వెల్లడించారు.