passport mela
-
నిజామాబాద్‌లో పాస్‌పోర్ట్ మేళా
హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం ఆధ్వర్యంలో నిజామాబాద్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో ఈ నెల 5న పాస్‌పోర్ట్ మేళాను నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పాస్‌పోర్ట్ కావాల్సిన అభ్యర్థులు బుధవారం నుంచి ఆన్లైన్లో www. passportindia.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మొదటిసారిగా పాస్‌పోర్ట్‌కు దరఖస్తు చేసుకునేవారి, పునరుద్ధరణ కావాల్సినవారి సాధారణ అప్లికేషన్లను మాత్రమే మేళాలో పరిశీలిస్తామని, ఆన్హోల్డ్, వాకిన్, పీసీసీ, తత్కాల్ అప్లికేషన్లను పరిశీలించబోమని అధికారులు వెల్లడించారు. -
సికింద్రాబాద్‌లో 5న పాస్‌పోర్ట్ మేళా
సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయంలో ఈ నెల 5న పాస్‌పోర్ట్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి బుధవారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. హోల్డ్‌లో ఉంచిన అప్లికేషన్లను మేళాలో పరిశీలించబోమని తెలిపారు. మేళాకు సంబంధించిన 300 స్లాట్లు మార్చి రెండో తేదీన పాస్‌పోర్ట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. -
12న తిరుపతిలో పాస్‌పోర్ట్ మేళా
సాక్షి, హైదరాబాద్: ఈనెల 12న తిరుపతి పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో పాస్‌పోర్ట్ మేళా నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారి ఎల్.మదన్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా 600 మందికి ఆన్లైన్ అపాయింట్మెంట్లు ఇస్తున్నట్టు తెలిపారు. 9 నుంచి అపాయింట్మెంట్లు అందుబాటులోకి వస్తాయని, కేవలం సాధారణ పాస్‌పోర్ట్‌లకే చేసుకోవాలని, తత్కాల్‌కు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఆన్లైన్ స్లాట్లకు www.passportindia.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. -
కుప్పంలో పాస్‌పోర్టు మేళా
హైదరాబాద్ సిటీ: ఈనెల 19, 20వ తేదీల్లో చిత్తూరు జిల్లా కుప్పంలో పాస్‌పోర్ట్ మేళా నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారి ఎల్.మదన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ మేళాను పీఈఎస్ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామన్నారు. రోజుకు 500 మందికి దరఖాస్తుకు అవకాశం ఉంటుందని, రెండ్రోజులకు వెయ్యి మంది ఈ మేళాలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈనెల 17వ తేదీ సాయంత్రం నుంచే స్లాట్లు అందుబాటులో ఉంటాయని అన్నారు. వివరాలకు www.passportindia.gov.in వెబ్సైట్ చూడచ్చన్నారు. ఈ మేళాలో కేవలం కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు, రీ యిష్యూ వారికే అవకాశం ఉంటుందని, తత్కాల్ వారికి అవకాశం లేదన్నారు. -
25న తిరుపతిలో పాస్‌పోర్ట్ మేళా
సాక్షి, హైదరాబాద్: ఈనెల 25న తిరుపతి పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో పాస్‌పోర్ట్ మేళా నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారి ఎల్.మదన్‌కుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 600 మందికి అవకాశం ఇస్తున్నట్టు తెలిపారు. సాధారణ, రీ యిష్యూ పాస్‌పోర్ట్‌లకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, తత్కాల్ పాస్‌పోర్ట్ దరఖాస్తులు స్వీకరించమని తెలిపారు. www.passportindia.gov.in వెబ్సైట్ ద్వారా అపాయింట్మెంట్లు నమోదు చేసుకోవాలన్నారు. బుధవారం (నేడు)నుంచి స్లాట్లు అందుబాటులో ఉంటాయన్నారు. -
25న జర్నలిస్టులకు పాస్‌పోర్ట్ మేళా
రీజనల్ పాస్‌పోర్టు అధికారి అశ్వినీ సత్తారు సాక్షి, హైదరాబాద్: ఈ నెల 25న జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు పాస్‌పోర్టు మేళా నిర్వహించనున్నట్లు రీజనల్ పాస్‌పోర్టు అధికారి అశ్వినీ సత్తారు వెల్లడించారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్, రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిం చనున్నారని తెలిపారు. శుక్రవారమిక్కడ ప్రెస్‌క్లబ్ కోశాధికారి శ్రీని వాసరావు, కార్యదర్శి రాజమౌళిచారితో కలసి ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈనెల 22 నుంచి 24 వరకు జర్నలిస్టులందరూ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి మాత్రమే పాస్‌పోర్టు మేళాకు అనుమతి ఉంటుందని చెప్పారు. -
జూలై 25న జర్నలిస్టులకు పాస్‌పోర్టు మేళా
హైదరాబాద్ : ఈ నెల(జూలై) 25వ తేదీన జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యుల కోసం ప్రత్యేకంగా పాస్‌పోర్టు మేళా నిర్వహించనున్నట్లు రీజనల్ పాస్‌పోర్టు అధికారి అశ్వినీ సత్తారు వెల్లడించారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్, రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రామాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్ కోశాధికారి పీవీ శ్రీనివాసరావు, కార్యదర్శి రాజమౌళిచారితో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అయితే ఈనెల 22 నుంచి 24 వరకు జర్నలిస్టులందరూ ప్రెస్‌క్లబ్‌లో రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలిపారు. అందుకు తమ కార్యాలయానికి చెందిన ఇద్దరు ఉద్యోగులు అందుబాటులో ఉంటారన్నారు. ఫైల్ ప్రాసెస్ ఏవిధంగా చేయాలో వారు సూచిస్తారన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి మాత్రమే 25న నిర్వహించే పాస్‌పోర్టు మేళాకు అనుమతి ఉంటుందన్నారు. -
కరీంనగర్లో పాస్‌పోర్ట్ మేళా
హైదరాబాద్ : ఈనెల 16వ తేదీన కరీంనగర్లో ఉన్న పాస్‌పోర్ట్ సేవా లఘు కేంద్రంలో పాస్‌పోర్ట్ సేవా క్యాంపు నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారి ఎల్.మదన్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లో మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 16, 17 తేదీలలో రెండు రోజుల పాటు క్యాంపు ఉంటుందని, రోజుకు 200 స్లాట్స్ చొప్పున రెండు రోజులకు 400 మంది దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ఈనెల 13వ తేదీ నుంచి ఆన్లైన్ స్లాట్లు నమోదు చేసుకోవచ్చునన్నారు. కేవలం సాధారణ పాస్‌పోర్ట్‌లకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, తత్కాల్ పాస్‌పోర్ట్‌లకు అవకాశం లేదని పేర్కొన్నారు. -
‘పాస్‌పోర్ట్ ప్రతి పౌరుడి హక్కు’
దర్శి (ప్రకాశం): ప్రతి భారతీయుడు పాస్‌పోర్టును హక్కుగా భావించి దాన్ని కలిగి ఉండాలని రీజనల్ పాస్‌పోర్టు డెరైక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా దర్శి ఆర్అండ్బీ అతిథి గృహంలో సోమవారం పాస్‌పోర్టు మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. దళారి వ్యవస్థలను రూపుమాపడానికే నేరుగా గ్రామ స్థాయిలో ఈ పాస్‌పోర్టు మేళా నిర్వహించామని తెలిపారు. డీఎస్పీ వి.శ్రీరాంబాబు మాట్లాడుతూ పాస్‌పోర్టు తీసుకునే వారు విచారణ కోసం సిబ్బంది ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు పూర్తి వివరాలు అందించాలని సూచించారు. -
మార్చి 14న పాస్‌పోర్ట్ మేళా
హైదరాబాద్ : మార్చి 14 వ తేదీన విజయవాడ, తిరుపతి పట్టణాల్లోని పాస్‌పోర్ట్ కేంద్రాల్లో పాస్‌పోర్ట్ మేళా నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారి ఎల్.మదన్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్ లో ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కో కేంద్రంలో 600 ఆన్లైన్ స్లాట్లు అందుబాటులో ఉంటాయని, ఈనెల 11వ తేదీనుంచి ఆన్లైన్ ద్వారా స్లాట్లను పొందవచ్చునని అన్నారు. అపాయింట్మెంట్స్ కోసం www.passportindia.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.మార్చి 14 వ తేదీ ఉదయం 9 గంటల నుంచి దరఖాస్తు దారులు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలకు రావచ్చని తెలిపారు. -
20న పాస్‌పోర్ట్ మేళా
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈనెల 20వ తేదీన పాస్‌పోర్ట్ మేళా నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారి ఎల్.మదన్‌కుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అమీర్‌పేట, బేగంపేట, విజయవాడ, తిరుపతి, నిజామాబాద్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో ఆరోజు ఉదయం 9.30 గంటల నుంచి మేళా నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు www.passportindia. gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఒక్కో పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో 300 మందికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. మేళాకు వచ్చే వారు దరఖాస్తు ఫారంతో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ధృవపత్రాలు తీసుకురావాలని చెప్పారు. సాధారణ పాస్‌పోర్టు దరఖాస్తుదారులకే ఈ అవకాశమని, తత్కాల్ పాస్‌పోర్ట్‌లు స్వీకరించరని తెలిపారు. నెల్లూరులో 20, 21 తేదీల్లో మేళా నెల్లూరు జెడ్పీ మీటింగ్ హాల్లో ఈనెల 20, 21 తేదీల్లో పాస్‌పోర్ట్ మేళా నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. -
6న పాస్‌పోర్ట్ మేళా
ఈ నెల 3న వెబ్సైట్లో అపాయింట్మెంట్లు సాక్షి, హైదరాబాద్: ఈ నెల 6న(శనివారం) హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలో ఉన్న అన్ని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల పరిధిలో పాస్‌పోర్ట్ మేళా నిర్వహిస్తున్నట్టు పాస్‌పోర్ట్ అధికారి అశ్విని సత్తారు వెల్లడించారు. దేశవ్యాప్తంగా పాస్‌పోర్ట్ మేళాలు జరగాలని జాతీయ చీఫ్ పాస్‌పోర్ట్ అధికారి ముక్తేశ్‌కుమార్ పరదేశి ఇప్పటికే ఆదేశించారు. ఇందులో భాగంగానే ఈ నెల 6న హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలో ఉన్న అమీర్‌పేట, బేగంపేట, టోలిచౌకి, తిరుపతి, విజయవాడ, నిజామాబాద్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో పాస్‌పోర్ట్ మేళా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తత్కాల్ దరఖాస్తులు తీసుకోరు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలన ఉండదు. కేవలం సాధారణ, రెన్యూవల్ పాస్‌పోర్ట్ దరఖాస్తులను మాత్రమే తీసుకుంటారని పాస్‌పోర్ట్ కార్యాలయ ప్రజాసంబంధాల అధికారి డాక్టర్ఎ.శిరీష్ అన్నారు. ఈ దరఖాస్తులకు సంబంధించి ఈ నెల 3న అపాయింట్మెంట్లు www.passportindia.gov.in వెబ్సైట్ ద్వారా పొందవచ్చన్నారు. విద్యార్థులకు, వయోవృద్ధులకు ప్రాధాన్యత ఇస్తారన్నారు. -
ప్రశాంతంగా పాస్‌పోర్ట్ మేళా
విశాఖపట్నం : పాస్‌పోర్ట్ మేళా శనివారం ప్రశాంతంగా ముగిసింది. బిర్లా జంక్షన్ దరి పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో మేళా జరిగింది. మేళాలో 800 మంది అభ్యర్థులకు అధికారులు అవకాశం కల్పించారు. మూడు రోజుల ముందుగా ప్రత్యేక స్లాట్ బుకింగ్‌తో అభ్యర్థులు మేళాలో పాల్గొనేలా చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల వాసులు మేళాలో పాల్గొనవచ్చని ప్రకటించారు. స్లాట్ బుకింగ్‌లో తెలిపిన సమయం ప్రకారం అభ్యర్థులకు అవకాశం కల్పించారు. త్వరతిగతిన సేవలు లభించడంతో పనులు వేగవంతంగా ముగిశాయి. దూర ప్రాంతాల నుంచి ఉదయాన్నే కార్యాలయానికి చేరుకున్న అభ్యర్థులు ఎండవేడిమికి అవస్థలు పడ్డారు. గ్రీన్ బెల్ట్‌లోని చెట్ల కింద కూర్చొని సేదతీరారు. ప్రస్తుతం స్లాట్ బుకింగ్ పొందడానికి సుమారు నెలన్నర రోజులకు పైగా పడుతుండగా, మేళా నిర్వాహణ ద్వారా కేవలం మూడు రోజుల వ్యవధిలో పాస్‌పోర్ట్ సేవలు లభ్యం కావడంతో అభ్యర్థుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఈనెల 28న మరోసారి మేళా నిర్వహిస్తున్నట్టు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. -
ఆజన్మం : సెలైంట్ మోడ్ జీవితం
ఆ లెక్కన, ఆ ఆర్కే అమ్మమ్మకూ, రేపు రాబోయే ఈ నాన్నమ్మకూ మధ్యన దాదాపు పది తరాల అంతరం ఉంటుంది! పత్రికలవాళ్ల కోసమని ఏర్పాటైన ‘పాస్‌పోర్ట్ మేళా’కు వెళ్లడానికి ధ్రువీకరణ పత్రాలను చివరిసారిగా చెక్ చేసుకున్నాను. టెన్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, గ్యాస్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, వన్ ఇయర్ బ్యాంకు స్టేట్మెంట్, ఆఫీస్ ఐడీ కార్డు... ఒరిజినల్సు, జిరాక్సులు... ఎంత అలౌకికంగా బతుకును వెళ్లదీద్దామనుకున్నా, ఇహపు వాస్తవికతను విస్మరించలేం! పైగా, చేతిలోకి వస్తున్నప్పుడైనా తీసుకోవాలన్న చిరు చాపల్యం! డబ్బులు, సెలవుల వెసులుబాటు ఉంటే గనక ఐరోపా యాత్ర చేయలేకపోయినా, వితంలో ఎప్పటికైనా కనీసం భూటాన్, శ్రీలంకైనా చూడాలని నా ఆశ! దాదాపుగా మిట్ట మధ్యాహ్నం. చౌరస్తాలో మిత్రులతో కలిసి ఆటోకోసం చూస్తున్నా. వేగంగా కదిలిపోతున్న ట్రాఫిక్‌లో, ఖరీదైన వాహనాల మధ్య, రిక్షా తొక్కుతూ ఒక చొక్కాలేని నల్లటి పలుచటి చెమటోడుతున్న శరీరం! పొడవాటి ఇనుపచువ్వలు వేసుకెళ్తున్నాడు. ఆ చిట్టచివరి శక్తి ప్రయోగిస్తే తప్ప పెడల్ కిందికి వెళ్లనంత బరువుగా ఉన్నట్టున్నాయవి! కూడదీసుకుంటూ అతను మూల మలుగుతున్నాడు. కొంత జరుగుబాటు ఉన్న కుటుంబంలో పుట్టడం కూడా ఒక్కోసారి పశ్చాత్తాపం పుట్టిస్తుంది. నా టక్కు, బూట్లు, చేతిలో ఉన్న ఫైలు ఉత్త అబద్ధాలు! నేను నోరు తెరుచుకుని చూస్తుంటే-‘‘ఏంటీ, వీడి మీద కూడా ఏమైనా రాస్తారా?’’ అన్నాడు పక్కనున్న స్నేహితుడు. ఆ చెమటను ఎటూ తుడవలేం. కనీసం తను వీడు అనకుండా ఉండాల్సింది! ఇతరత్రా చాలా పద్ధతిగా ఉండే ఆ సహచరుణ్ని నేను ఈ ‘కాలమ్ కోర్టు’కు ఈడ్వలేను; అతడు యధాలాపంగా ఆ మాట అనివుండొచ్చు; కానీ యధాలాపంగా కూడా అనకుండా అడ్డుకోగలిగేదేదో మన శరీరాల్లో నిర్మాణం కావాలని నేను కోరుకుంటాను. పాస్ట్‌పోర్టు పనికి ఆధార్ కార్డు, టెన్తు సర్టిఫికెట్లు సరిపోయాయి. మళ్లీ ఆఫీస్. మళ్లీ రొటీన్. మళ్లీ సైనాఫ్. ఎప్పుడు మొదలైందో తెలీదు; సన్నటి తలపోటు! దానికి పొగవైద్యం చేద్దామని సాయంత్రం అలా నడుస్తూ ఒక సందులోకి వెళ్లాను. పరిశుభ్రమైన వాతావరణం కాదు. నడిచిపోతుంది! అక్కడ ఒక జీన్సు ప్యాంటు యువకుడు దేనికోసమో వెతుకుతున్నట్టుగా అనిపించింది. ముఖంలో ఆందోళన! కాసేపటికి ఒక పెద్ద మూరెడు కట్టె ఎక్కడో సంపాదించుకొచ్చి, కుండీలోంచి కిందకు దొర్లిపోయిన చెత్తను పెకిలిస్తున్నాడు. ‘‘ఏం బోయిందే?’’ ‘‘ఫోనన్నా!’’ టాయ్‌లెట్‌కు వెళ్లి, ఈలోగా బస్సు వస్తే పరుగెత్తుకుంటూ వచ్చాడట. ఆ హడావిడిలో జేబులోంచి పడిపోయుంటుంది! నా ఫోన్ చేతిలోకి తీసుకుంటూ, ‘‘రింగివ్వక పోయావా?’’ అన్నాను. సెలైంటులో ఉందని చెప్పాడు. అయ్యో! మూడు ఫోన్లు పోయిన బాధితుడిగా ఆ నొప్పి ఎలా ఉండగలదో నాకు తెలుసు. ఆ చెత్తకుప్పలో లఘుశంక ఖర్మేమిటి తనకు? సరైన పబ్లిక్ టాయ్లెట్లు కూడా లేనిది ఇదొక రాజధాని నగరం? ఫోన్ ఎంతకీ దొరకలేదు. పోయిందో, కొట్టేశారో! ఉన్నట్టుండి, పొద్దుటి నల్లటి చెమట శరీరం కళ్లముందు కదలాడింది. ఎంతమంది జీవితాలు ఇలా ‘సెలైంట్ మోడ్’లోనే ఉండిపోతున్నాయి! ఎప్పుడో చదివాను: ఆర్కే నారాయణ్ వాళ్ల అమ్మమ్మ ఇంగ్లీషు చదివేవారట! మా తాతకంటే వయసులో పెద్దవారైన ఆర్కే! వాళ్ల అమ్మమ్మ!! ఇంగ్లీషు!!! అలాంటిది, మా అమ్మ తెలుగు కూడా చదవలేదు. అంటే, ‘మా నాన్నమ్మకు ఇంగ్లీషు వచ్చు,’ అని రేపెప్పుడైనా నా మునిమనవడు చెప్పగలగాలంటే, మేము ఇంకెన్ని తరాలు ముందుకు జరగాలి! ఆ లెక్కన, ఆ ఆర్కే అమ్మమ్మకూ, రేపు రాబోయే ఈ నాన్నమ్మకూ మధ్యన దాదాపు పది తరాల అంతరం ఉంటుంది! పొద్దున పాస్‌పోర్ట్ ఆఫీసుకు వెళ్లేప్పుడు సెలైంటులో పెట్టుకున్న నా ఫోన్‌ను తిరిగి వాల్యూమ్ సెట్టింగ్స్‌లో ఐదింట ‘3’ చేసుకుని, బస్సెక్కాను. మెడలు, జడలు ఊరటనివ్వడం లేదు. నా బాధల్లా, ఆ నల్లరంగు చెమట శరీరపు మనవడైనా భూటాన్ వెళ్లడం గురించి కనీసం ఆలోచిస్తాడా? - పూడూరి రాజిరెడ్డి