సాక్షి, హైదరాబాద్: ఈనెల 25న తిరుపతి పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో పాస్‌పోర్ట్ మేళా నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారి ఎల్.మదన్‌కుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 600 మందికి అవకాశం ఇస్తున్నట్టు తెలిపారు.
సాధారణ, రీ యిష్యూ పాస్‌పోర్ట్‌లకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, తత్కాల్ పాస్‌పోర్ట్ దరఖాస్తులు స్వీకరించమని తెలిపారు. www.passportindia.gov.in వెబ్‌సైట్ ద్వారా అపాయింట్‌మెంట్‌లు నమోదు చేసుకోవాలన్నారు. బుధవారం (నేడు)నుంచి స్లాట్‌లు అందుబాటులో ఉంటాయన్నారు.
25న తిరుపతిలో పాస్‌పోర్ట్ మేళా
Published Wed, Jul 22 2015 8:42 AM | Last Updated on Sun, Sep 3 2017 5:58 AM
Advertisement
Advertisement