
12న తిరుపతిలో పాస్‌పోర్ట్ మేళా
సాక్షి, హైదరాబాద్: ఈనెల 12న తిరుపతి పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో పాస్‌పోర్ట్ మేళా నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారి ఎల్.మదన్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా 600 మందికి ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్‌లు ఇస్తున్నట్టు తెలిపారు.
9 నుంచి అపాయింట్‌మెంట్‌లు అందుబాటులోకి వస్తాయని, కేవలం సాధారణ పాస్‌పోర్ట్‌లకే చేసుకోవాలని, తత్కాల్‌కు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ స్లాట్‌లకు www.passportindia.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు.