హైదరాబాద్ సిటీ: ఈనెల 19, 20వ తేదీల్లో చిత్తూరు జిల్లా కుప్పంలో పాస్‌పోర్ట్ మేళా నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారి ఎల్.మదన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ మేళాను పీఈఎస్ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామన్నారు.
రోజుకు 500 మందికి దరఖాస్తుకు అవకాశం ఉంటుందని, రెండ్రోజులకు వెయ్యి మంది ఈ మేళాలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈనెల 17వ తేదీ సాయంత్రం నుంచే స్లాట్‌లు అందుబాటులో ఉంటాయని అన్నారు. వివరాలకు www.passportindia.gov.in వెబ్‌సైట్ చూడచ్చన్నారు. ఈ మేళాలో కేవలం కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు, రీ యిష్యూ వారికే అవకాశం ఉంటుందని, తత్కాల్ వారికి అవకాశం లేదన్నారు.
కుప్పంలో పాస్‌పోర్టు మేళా
Published Mon, Aug 17 2015 7:45 PM | Last Updated on Sun, Sep 3 2017 7:37 AM
Advertisement
Advertisement