రీజనల్ పాస్‌పోర్టు అధికారి అశ్వినీ సత్తారు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 25న జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు పాస్‌పోర్టు మేళా నిర్వహించనున్నట్లు రీజనల్ పాస్‌పోర్టు అధికారి అశ్వినీ సత్తారు వెల్లడించారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్, రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిం చనున్నారని తెలిపారు. శుక్రవారమిక్కడ ప్రెస్‌క్లబ్ కోశాధికారి శ్రీని వాసరావు, కార్యదర్శి రాజమౌళిచారితో కలసి ఆమె విలేకరులతో మాట్లాడారు.
ఈనెల 22 నుంచి 24 వరకు జర్నలిస్టులందరూ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి మాత్రమే పాస్‌పోర్టు మేళాకు అనుమతి ఉంటుందని చెప్పారు.
25న జర్నలిస్టులకు పాస్‌పోర్ట్ మేళా
Published Sat, Jul 18 2015 12:20 AM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM
Advertisement
Advertisement