సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈనెల 20వ తేదీన పాస్‌పోర్ట్ మేళా నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారి ఎల్.మదన్‌కుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అమీర్‌పేట, బేగంపేట, విజయవాడ, తిరుపతి, నిజామాబాద్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో ఆరోజు ఉదయం 9.30 గంటల నుంచి మేళా నిర్వహిస్తామన్నారు.
అభ్యర్థులు www.passportindia. gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఒక్కో పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో 300 మందికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. మేళాకు వచ్చే వారు దరఖాస్తు ఫారంతో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ధృవపత్రాలు తీసుకురావాలని చెప్పారు. సాధారణ పాస్‌పోర్టు దరఖాస్తుదారులకే ఈ అవకాశమని, తత్కాల్ పాస్‌పోర్ట్‌లు స్వీకరించరని తెలిపారు.
నెల్లూరులో 20, 21 తేదీల్లో మేళా
నెల్లూరు జెడ్పీ మీటింగ్ హాల్‌లో ఈనెల 20, 21 తేదీల్లో పాస్‌పోర్ట్ మేళా నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.
20న పాస్‌పోర్ట్ మేళా
Published Thu, Dec 18 2014 2:18 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement