6న పాస్‌పోర్ట్ మేళా | On 6 Passport Mela | Sakshi
Sakshi News home page

6న పాస్‌పోర్ట్ మేళా

Published Tue, Dec 2 2014 5:57 AM | Last Updated on Mon, Apr 8 2019 7:50 PM

6న పాస్‌పోర్ట్ మేళా - Sakshi

6న పాస్‌పోర్ట్ మేళా

  • ఈ నెల 3న వెబ్‌సైట్‌లో అపాయింట్‌మెంట్‌లు
  • సాక్షి, హైదరాబాద్: ఈ నెల 6న(శనివారం) హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలో ఉన్న అన్ని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల పరిధిలో పాస్‌పోర్ట్ మేళా నిర్వహిస్తున్నట్టు పాస్‌పోర్ట్ అధికారి అశ్విని సత్తారు వెల్లడించారు. దేశవ్యాప్తంగా పాస్‌పోర్ట్ మేళాలు జరగాలని జాతీయ చీఫ్ పాస్‌పోర్ట్ అధికారి ముక్తేశ్‌కుమార్ పరదేశి ఇప్పటికే ఆదేశించారు.

    ఇందులో భాగంగానే ఈ నెల 6న హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలో ఉన్న అమీర్‌పేట, బేగంపేట, టోలిచౌకి, తిరుపతి, విజయవాడ, నిజామాబాద్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో పాస్‌పోర్ట్ మేళా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.  తత్కాల్ దరఖాస్తులు తీసుకోరు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలన ఉండదు.

    కేవలం సాధారణ, రెన్యూవల్ పాస్‌పోర్ట్ దరఖాస్తులను మాత్రమే తీసుకుంటారని పాస్‌పోర్ట్ కార్యాలయ ప్రజాసంబంధాల అధికారి డాక్టర్‌ఎ.శిరీష్ అన్నారు. ఈ దరఖాస్తులకు సంబంధించి ఈ నెల 3న అపాయింట్‌మెంట్లు www.passportindia.gov.in వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చన్నారు. విద్యార్థులకు, వయోవృద్ధులకు ప్రాధాన్యత ఇస్తారన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement