మార్చి 14 వ తేదీన విజయవాడ, తిరుపతి పట్టణాల్లోని పాస్‌పోర్ట్ కేంద్రాల్లో పాస్‌పోర్ట్ మేళా నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారి ఎల్.మదన్‌కుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ : మార్చి 14 వ తేదీన విజయవాడ, తిరుపతి పట్టణాల్లోని పాస్‌పోర్ట్ కేంద్రాల్లో పాస్‌పోర్ట్ మేళా నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారి ఎల్.మదన్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్ లో ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కో కేంద్రంలో 600 ఆన్‌లైన్ స్లాట్‌లు అందుబాటులో ఉంటాయని, ఈనెల 11వ తేదీనుంచి ఆన్‌లైన్ ద్వారా స్లాట్‌లను పొందవచ్చునని అన్నారు.
అపాయింట్‌మెంట్స్ కోసం www.passportindia.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.మార్చి 14 వ తేదీ ఉదయం 9 గంటల నుంచి దరఖాస్తు దారులు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలకు రావచ్చని తెలిపారు.