- రాజధాని ప్రాంత రైతులకు సర్కారు పరోక్ష హెచ్చరిక
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధానిలో భూ సమీకరణకు కొత్త పంథా ఎంచుకుంది. ‘ఈ నెలాఖరు(28) వరకే భూ సమీకరణ. మార్చి 1 నుంచి భూ సేకరణే. ఇక మీ ఇష్టం. ఇందులో బలవంతమేమీ లేదు. నిర్ణయం మీదే’అని నమ్మబలుకుతూ సమీకరణ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ఎత్తుగడ వేస్తోంది. భూ సేకరణ జరిగితే నష్టం మీకేనంటూ పరోక్షంగా జరీబు రైతులను హెచ్చరిస్తోంది. బుధవారం పెనుమాక, రాయపూడి, ఉండవల్లి గ్రామాల్లో పర్యటించిన మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులు రైతులను ఉద్దేశించి ఈ విధంగానే మాట్లాడడం గమనార్హం.