ఆర్టీసీ నుంచి అందాల్సిన ప్రయోజనాలు అందక, మరోవైపు వృద్ధాప్యంలో అవి అందుకోకుండా పలువురు మరణించారన్నారు. ఈ నేపథ్యంలో వృద్ధుల పట్ల కనికరం చూపుతూ తక్షణమే రూ.100 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా 3 ఏళ్లుగా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ కూడా నిలిచిపోయిందని, దీని వల్ల ప్రతి ఉద్యోగికి ఇప్పటి వరకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు బకాయీలు పేరుకుపోయాయన్నారు.
ఆర్టీసీ ఆస్పత్రుల్లో కూడా అవసరమైన మందులు ఉండడం లేదని, ప్రైవేటు ఏజెన్సీకి ఇచ్చినా మందులు అందుబాటులో ఉంచకపోవడం దారుణమన్నారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించని పక్షంలో అక్టోబర్ 5వ తేదీన విజయవాడలోని ఆర్టీసీ ఎండీ కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఛలో విజయవాడ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు తరలి రావాలని హరిప్రసాదరావు హెచ్చరించారు. ధర్నాలో రీజనల్ అధ్యక్ష, కార్యదర్శులు కోటా నాగేశ్వరరావు, ఎస్.పోలేరయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.ఇన్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీకే మూర్తి పాల్గొన్నారు.