ఫారెక్స్ నిల్వలు ‘ 381.95 బిలియన్ డాలర్లు
దేశంలో ఫారెక్స్ నిల్వలు పెరిగాయి. ఇవి జూన్ 16తో ముగిసిన వారంలో 799 మిలియన్ డాలర్ల మేర పెరుగుదలతో 381.95 బిలియన్ డాలర్లకు ఎగశాయి.
ముంబై: దేశంలో ఫారెక్స్ నిల్వలు పెరిగాయి. ఇవి జూన్ 16తో ముగిసిన వారంలో 799 మిలియన్ డాలర్ల మేర పెరుగుదలతో 381.95 బిలియన్ డాలర్లకు ఎగశాయి. దీనికి విదేశీ కరెన్సీ అసెట్స్‌లో పెరుగుదల ప్రధాన కారణం. రిజర్వు బ్యాంక్ తాజా గణాంకాల ప్రకారం.. ఫారెక్స్ నిల్వల్లో కీలకమైన విదేశీ కరెన్సీ అసెట్స్ 802.4 మిలియన్ డాలర్లమేర పెరుగుదలతో 358.08 బిలియన్ డాలర్లకు ఎగశాయి. బంగారం నిల్వలు ఎప్పటిలాగే స్థిరంగా 20.09 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
ఇక ఐఎంఎఫ్ వద్ద ఉన్న స్పెషల్ డ్రాయింగ్ రైట్స్‌కు సంబంధించిన మొత్తం 1.3 మిలియన్ డాలర్ల తగ్గుదలతో 1.46 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యింది. అలాగే ఐఎంఎఫ్ వద్ద ఉన్న నిల్వలకు సంబంధించిన మొత్తం కూడా 2.1 మిలియన్ డాలర్లమేర తగ్గుదలతో 2.3 బిలియన్ డాలర్లకు క్షీణించింది. కాగా కడపటి వారంలో ఫారెక్స్ నిల్వలు 11.5 మిలియన్ డాలర్లమేర క్షీణించి 381.15 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
ఫారెక్స్ నిల్వలు ‘381.95 బిలియన్ డాలర్లు