ముంబై: భారత విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వల చరిత్రాత్మక రికార్డులు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 18వ తేదీతో ముగిసిన వారంలో అంతకుముందు వారంతో పోల్చిచూస్తే (సెప్టెంబర్ 11) నిల్వలు 3.378 బిలియన్ డాలర్లు పెరిగి 545.038 బిలియన్ డాలర్లకు ఎగశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజా గణాంకాలను శుక్రవారం విడుదల చేసింది. జూన్ 5తో ముగిసిన వారంలో మొట్టమొదటిసారి భారత్ ఫారెక్స్ నిల్వలు అర ట్రిలియన్ మార్క్‌దాటి 501.70 బిలియన్ డాలర్లకు చేరాయి. అటు తర్వాత కొంచెం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, నిల్వలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుత నిల్వలు దాదాపు భారత్ 15 నెలల దిగుమతులకు సరిపోతాయన్నది అంచనా. దిగుమతులకు సంబంధించి వ్యయాలు తగ్గడం, పెరిగిన పసిడి నిల్వల విలువ వంటి అంశాలు దీనికి నేపథ్యం. తాజా సమీక్షా వారంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
► డాలర్ల రూపంలో పేర్కొనే ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్‌సీఏ) 3.943 బిలియన్ డాలర్లు ఎగసి 501.464 బిలియన్ డాలర్లకు చేరాయి.
► అయితే పసిడి నిల్వల విలువ 580 మిలియన్లు తగ్గి, 37.440 బిలియన్ డారల్లకు చేరింది. అంతర్జాతీయంగా పసిడి ధర తగ్గడం దీనికి నేపథ్యం.
► అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ పరిమాణం మిలియన్ డాలర్లు పెరిగి 1.483 బిలియన్ డాలర్లకు చేరింది.
► ఇక ఐఎంఎఫ్ వద్ద రిజర్వ్స్ మాత్రం 14 మిలియన్ డాలర్లు తగ్గి 4.651 బిలియన్ డాలర్లకు చేరింది.
కొనసాగుతున్న ఫారెక్స్ నిల్వల రికార్డులు
Published Sat, Sep 26 2020 6:50 AM | Last Updated on Sat, Sep 26 2020 6:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment