ముంబై: భారత్ విదేశీ మారక నిల్వలు మార్చి 15వ తేదీతో ముగిసిన వారంలో భారీగా 3.6 బిలియన్ డాలర్లు పెరిగాయి. దీనితో ఈ పరిమాణం 405.6 బిలియన్ డాలర్లకు చేరింది. డాలర్ రూపంలో పేర్కొనే ఫారెన్ కరెన్సీ అసెట్స్ విలువ పెరుగుదల దీనికి ప్రధాన కారణం. 2018 ఏప్రిల్ 13న భారత్ విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయి 426.028 బిలియన్ డాలర్ల స్థాయిని చూశాయి. అటు తర్వాత రూపాయ బలహీనత, విదేశీ నిధులు వెనక్కుపోవడం వంటి అంశాల నేపథ్యంలో కొంత తగ్గాయి.
Comments
Please login to add a commentAdd a comment