రికార్డు స్థాయికి విదేశీ మారక నిల్వలు
ముంబై: భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు ఏప్రిల్ 8వ తేదీతో ముగిసిన వారంలో రికార్డు గరిష్ట స్థాయికి చేరాయి. అంతకుముందు వారంతో పోల్చితే... 158 మిలియన్ డాలర్లు ఎగసి 360 బిలియన్ డాలర్లుకు ఎగబాకాయి. విదేశీ కరెన్సీ అసెట్స్‌గా పేర్కొనే డాలర్ల పరిమాణం పెరగడం మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వలు రికార్డు స్థాయికి పెరిగేందుకు దోహదపడినట్లు శుక్రవారం విడుదలైన రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గణాంకాలు తెలిపాయి. కేవలం డాలరు ఆస్తులే 159 మిలియన్లు ఎగసి 336 బిలియన్లకు చేరాయి. కాగా పసిడి నిల్వలు స్థిరంగా 20 బిలయన్ డాలర్లుగా కొనసాగుతున్నాయి.